తాతలు తండ్రులు కొలిచిన వాడవు
గోవింద ఆహా గోవిందా .. గోవింద ఆహా గోవిందా
గోవింద ఆహా గోవిందా .. గోవింద ఆహా గోవిందా
ఆహా గోవిందా .. ఆహా గోవిందా .. ఆహా గోవిందా
తాతలు తండ్రులు కొలిచిన వాడవు
దాతవు నీవే దైవమా
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా
మత్తున ముంచకు రా మా దొరా
కొలిచే వాళ్లము లేమో నమో నారాయణా
కొలువే నీది కదా గుండెలలోనా
నిలిచే నీడవురా పావనా సనాతనా
నిజమే నీవు కదా ఈ జగానా
తాతలు తండ్రులు కొలిచిన వాడవు
దాతవు నీవే దైవమా
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా
మత్తున ముంచకు రా మా దొరా
మొక్కులు నీవే పూజలు నీవే
ఏ పూలతో పూజ చెయ్యాలిరా
దీపం నీవే హారతి నీవే
నీరాజనాలేమి చూపాలిరా
దయను తప్పకు సామీ నమో నమో
దరిని చూపవదేమి
భయము తీర్చర సామీ నమో నమో
అభయం నీదిర సామి
మంత్రము నీవే తంత్రము నీవే
ఏ మంత్రమీనాడు చెప్పాలిరా
గానం నీవే ధ్యానం నీవే
త్యాగయ్యలా పాడుకోలేనురా
కలినే తీర్చర సామీ నమో నమో
కర్మను బాపర సామీ
పునః జన్మము లేని నమో నమో
పుణ్యము నొసగ వదేమి
గోవిందా ఆహా గోవిందా .. గోవిందా హరే గోవిందా
గోవిందా ఆహా గోవిందా .. గోవిందా హరే గోవిందా
కొండలు నీవే కోవెల నీవే
ఎన్నెన్ని మెట్లెక్కి రావాలిరా
నీలాలు నీవే కాలాలు నీవే
ఏమేమి మొక్కుల్ని తీర్చాలిరా
ఆపద మొక్కుల వాడా నమో నమో
నీ పదమంటితి లేరా
నీ పద దాసుడనైతే నమో నమో
ఏ పదమెందుకు లేరా
తాతలు తండ్రులు కొలిచిన వాడవు
దాతవు నీవే దైవమా
ఎత్తులు మరిగిన వెంకటేశ్వరా
మత్తున ముంచకు రా మా దొరా
దాతవు నీవే దైవమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి