Keblinger

Keblinger

28, ఆగస్టు 2014, గురువారం

శ్రీ గణేశాయ ధీమహి ...









గణ నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణ శరీరాయ గుణ మండితాయ గుణేశానాయ ధీమహి
 గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహీ 

ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
 గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
 ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గాన మత్తాయ గానోత్సుకమనసే
 గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్థాయినే
గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే
  గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ
గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండఖండకాయ

గీత సారాయ గీత తత్త్వాయ గీత గోత్రాయ ధీమహి
గూఢ గుల్ఫాయ గంధ మత్తాయ గో జయప్రదాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

గంధర్వరాజాయ గంధాయ గంధర్వగాన శ్రవణ ప్రణయినే
గాఢానురాగాయ గ్రంథాయ గీతాయ గ్రంథార్థతత్వమితే
గుణినే ... గుణవతే ... గణపతయే

గ్రంథగీతాయ గ్రంథ గేయాయ గ్రంథాంతరాత్మనే
గీత లీనాయ గీతాశ్రయాయ గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయకవరాయ గంధర్వ ప్రియకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే
గౌరీస్తనందనాయ గౌరీ హృదయ నందనాయ
గౌరభాను సుతాయ గౌరీ గణేశ్వరాయ

గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌర భావాయ ధీమహి
గో సహస్రాయ గోవర్థనాయ గోప గోపాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
   

23, ఆగస్టు 2014, శనివారం

బ్రహ్మ కడిగిన పాదము





బ్రహ్మ కడిగిన పాదము


బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
 
చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
 తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమతొ శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

బ్రహ్మ కడిగిన పాదము 
 బ్రహ్మము తానెని పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము

15, ఆగస్టు 2014, శుక్రవారం

చక్కని తల్లికి చాంగుభళా ..





చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చాంగుభళా .. చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొలపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చాంగుభళా .. చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చాంగుభళా .. చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా 
విందయి వెంకట విభుబెనచిన తన
సంది దండలకు చాంగుభళా

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చాంగుభళా .. చాంగుభళా


14, ఆగస్టు 2014, గురువారం

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని ..




క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ... నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ... నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ... నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం

 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం ... నీరాజనం 

12, ఆగస్టు 2014, మంగళవారం

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ...







సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నుదుట కుంకుమ రవిబింబముగా 
కన్నుల కాటుక నిండుగ వెలుగ
కాంచనహారము గళమున మెరియగ 
పీతాంబరముల శోభలు నిండగ

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిండుగ కరముల బంగారుగాజులు 
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి చేయగ  
సౌభాగ్యవతుల సేవల నందగ

సౌభాగ్యలక్ష్మీ రావమ్మాఅమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

సౌభాగ్యమ్ముల బంగరు తల్లి 
పురంధర విఠలుని పట్టపు రాణి
శుక్రవారపు పూజలనందగ 
సాయం సంధ్యా శుభ ఘడియలలో 

 సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా 
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కల్యాణి  
భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా 
కనకవృష్టి కురిపించే తల్లీ

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా  
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)