సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నుదుట కుంకుమ రవిబింబముగా
కన్నుల కాటుక నిండుగ వెలుగ
కాంచనహారము గళమున మెరియగ
పీతాంబరముల శోభలు నిండగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నిండుగ కరముల బంగారుగాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి చేయగ
సౌభాగ్యవతుల సేవల నందగ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మాఅమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి
పురంధర విఠలుని పట్టపు రాణి
శుక్రవారపు పూజలనందగ
సాయం సంధ్యా శుభ ఘడియలలో
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ... అమ్మా
సౌభాగ్యలక్ష్మీ రావమ్మా
నిత్య సుమంగళి నిత్య కల్యాణి
భక్త జనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా
కనకవృష్టి కురిపించే తల్లీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి