Keblinger

Keblinger

30, మార్చి 2012, శుక్రవారం

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు



తక్కువేమి మనకు..



తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమై యుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ

  తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు


కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తిమము గాచుచు నుండగ

 తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

నారాయణదాసుని గాచిన శ్రీమన్
నారాయణు నెర నమ్మియుండగ

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు


రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ


29, మార్చి 2012, గురువారం

M.S రామారావు - తెలుగు హనుమాన్ చాలీసా


M.S రామారావు - తెలుగు హనుమాన్ చాలీసా





శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని
తెలుపు సత్యములు
శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపరసాధక
శరణములూ

జయహనుమంత జ్ఞానగుణవందిత
జయపండిత త్రిలోకపూజితా
రామదూత అతులిత బలధామా
అంజనీ పుత్ర పవనసుతనామా
ఉదయభానునీ మధురఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజిత వేషా
కుండల మండిత కుంచిత కేశా

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజ పదవి సుగ్రేవున నిలిపి
జానకీ పతి ముద్రిత తోడ్కొని
జలధిలంఘించి లంకచేరుకొని
సూక్ష్మరూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామ కార్యము సఫలముజేసిన

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

సీతజాడగని వచ్చిన నినుగని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతులా నిను కొనియాడగ
కాగల కార్యము నీపైనిడగా
వానరసేనతో వారిధి దాటి
లంకేశునితో తలపడి పోరి
హోరు హోరున పోరు సాగినా
అసుర సేనల వరుసన గూల్చిన

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

లక్ష్మణ మూర్చతో రాముడడలగా
సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని శ్రీరామభాణమూ
జరిపించెను రావణ సంహారము
ఎదిరిలేని ... లంకాపురమున
ఏలికగా విభీషణుచేసిన

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల ఆరతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోధ్యాపురి పొంగి పొరలే
సీతారాముల సుందర మందిరం
శ్రీకాంతుపదం నీహృదయం
రామచరిత కర్ణామృతగానా
రామనామ రసామృత పాన

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

దుర్గమమగు ఏకార్యమైనా
సుగమమేయగు నీకృపచాలిన
కలుగు శుభములు నినుశరణన్నా
తొలగు భయములు నీరక్షణయున్నా
రామద్వారపు కాపరివైననీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాకినీ డాకిని
భయపడి పారు నీనామజపమువిని

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ


ధ్వజావిరాజా వజ్రశరీర
భుజబలతే జాగదాధరా
ఈశ్వరాంశ సంభూత పవిత్ర
కేసరీపుత్రా పావనగాత్ర
సనకాదులు బ్రహ్మాదిదేవతలు
శారద నారద ఆదిశేషులూ
యమకుబేర దిక్పాలురు కవులూ
పులకితులైరి నీకీర్తిగానముల

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

సోదర భరత సమానాయని
శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమా
సాధుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా
అష్టసిద్ధి నవనిధులకు దాతగా
జానకీమాత దీవించెనుగా
రామరసామృత పానము చేసిన
మృత్యుంజయుడవై వెలసినా

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

నీనామభజన శ్రీరామరంజన
జన్మజన్మాంతర దుఖభంజన
యెచ్చటుండినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామకీర్తన
అందందున హనుమాను నర్తన

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

శ్రద్ధగ దీనిని ఆలకింపుమా
శుభమగు ఫలములు కలుగుసుమా
భక్తి మీరగా గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా
తులసిదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నింపుమన్నా

శ్రీహనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ

మంగళ హారతి గొనుహనుమంతా
సీతారామ లక్ష్మణ సమేతా
నా అంతరాత్మ నేలుమో అనంతా
నీవే అంతా ... శ్రీహనుమంతా ...
ఓం శాంతి శాంతి శాంతి:



13, మార్చి 2012, మంగళవారం

Sacred Chants by A.R.Rahman



శుక్లాంబరధరం విష్ణుం



రుద్రం పశుపతిం



అయిగిరి నందిని 





Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)