తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమై యుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తిమము గాచుచు నుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
నారాయణదాసుని గాచిన శ్రీమన్
నారాయణు నెర నమ్మియుండగ
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి