శ్రీరామ నీ నామ మేమి రుచిరా
ఓ రామ నీ నామమెంత రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా
ఓ రామ నీ నామమెంత రుచిరా
కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణుల
గాచిన నీ నామమెంత రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా
కదళీ కర్జూరాది ఫలముల కధికమౌ
పతితపావన నామమెంత రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా
అంజనతనయు హృత్కంజతలము
రంజిల్లు నీ నామ మేమి రుచిరా
శ్రీరామ నీ నామమేమి రుచిరా
శ్రీ సదాశివుడు నిన్ను సదా భజించేటి
సదానంద నామమెంత రుచిరా
శ్రీరామ నీ నామమేమి రుచిరా
తంబురనారదుల్ డంబమీరగ గా
నంబు చేసెడి నామ మేమి రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా
అరయ భద్రాచల శ్రీ రామదాసుని
ఏలిన నీ నామమెంత రుచిరా
శ్రీరామ నీ నామ మేమి రుచిరా
ఓ రామ నీ నామమెంత రుచిరా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి