Keblinger

Keblinger

16, జనవరి 2012, సోమవారం

15, జనవరి 2012, ఆదివారం

14, జనవరి 2012, శనివారం

అపూర్వం - భోగి పర్వం







తిరుప్పావై - పాశురము 30




తిరుప్పావై
- పాశురము 30

వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్!
వ్రతాచరణమే ఇహపర సౌఖ్యాలకు మూలం

ఓడలు తిరుగాడే మహాసముద్రాన్ని చిలికిన శ్రీ మహావిష్ణువూ,
కేశియను రాక్షసుని సంహరించినవాడూ అయిన శ్రీ గోపాలకృష్ణుని సన్నిధిని జేరి
గోదాదేవి భక్తితో సుతించి కీర్తించింది.
నానారకాలైన ఆభరణాలను అలంకరించుకొన్న చంద్రముఖులైన గోపికలు
వ్రేపల్లెలో పొందిన వరాల వృత్తాంతాన్ని వివరిస్తూ,
శ్రీ గోదాదేవి తిరుప్పావు స్తుతిని చేసింది.
గోదాదేవి భూమండలానికే అలంకారప్రాయమైన శ్రీవిల్లిపుత్తూరుక్షేత్రంలోని విష్ణుచిత్తుడనే
పరమభాగవత్తోముని ముద్దులకూతురు.
మనోహరమైన వికసితతామరపుష్పమాలను ధరించిన
శ్రీ గోదాదేవి ( ఆండాళ్ ) తమిళభాషలో సమర్పించిన తిరుప్పావై అనే ముప్పది పాశురములుగల
పుష్పమాలికను ధనుర్మాసంలో గాని, లేదా ప్రతినిత్యమూ గాని పారాయణ చేసేవారు,
చతుర్భుజుడై పద్మ నేత్రుడై సుందరదరహాసవిందుడై సర్వసంపదలతో
విరాజిల్లుతున్న శ్రీనివాస ప్రభువుల పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్షములకు పాత్రులై,
ఇహపర సౌఖ్యాలు పొందుతారు

13, జనవరి 2012, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 29





తిరుప్పావై
- పాశురము 29

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్

నిత్యమూ స్వామివారి సేవ కోరడం

పొద్దు పొడవడానికి ముందే మసక మసక చీకటిలో వచ్చి సేవించి
నీ పవిత్రపాదపద్మాలకు మంగళాశాసనం పాడుతున్న మా ప్రార్థనను వినుమయ్యా స్వామీ !
పశువులను మేపుకుంటూ జీవనం సాగించే గోపల్లెవాడలో సామాన్యుల ఇంట జన్మించి
అందరికీ అందుబాటులో ఉండే స్వామీ ! దాసానుదాసులమైన నిన్ను సేవిస్తున్న
మా అంతరంగ భావాలను తృణికరించవద్దు.
ఈ రోజు నుంచి ఒక్క పరమార్థాన్ని పొందేందుకు మాత్రమే రాలేదు సుమా !
ఓ గోవిందా ! ఎల్లవేళలా, ఏడేడు జన్మలా స్వామివారితో సంబంధాన్ని కలిగి సేవ చెయ్యగోరుతున్నాము.
ఇంక ఇతర కోరికలకు అవకాశమివ్వవద్దు.
మాకు తప్పక వ్రతఫలం అందజెయ్యి.

12, జనవరి 2012, గురువారం

తిరుప్పావై - పాశురము 28




తిరుప్పావై
- పాశురము 28


క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.

గోపికలు తమ భక్తి ప్రపత్తులు వెల్లడించడం

స్వామీ ! మేము పశువులవెంట పోతూ, వాటిని అడవుల్లో మేపుకొంటూ జీవించేవాళ్ళం.
నీవు జన్మించినందువల్ల గోకులం మాహాపుణ్యప్రదమయ్యింది.
అలాంటి గోప్రల్లెలోనే మా భాగ్యవశంచేత మేమూ పుట్టాం. సర్వలక్షణశోభితుడైన గోవిందా !
ఈ గోపల్లెలో నీ తోడి మా సంబంధం విడదీయలేనిది, విడదీయరానిది. .
మేము ఏమీ తెలియని అమాయకులమైన గోపకన్నెలం !
స్వామీ ! నేస్తాలమైన మేము ప్రేమతో అతిచనువుగా నిన్ను ముద్దు పేర్లతో పిలిచినందుకు అలిగిపోవద్దు.
మాపై దయ కలిగి పురుషార్థాలను ప్రసాదించి మా నోమును నెరవేర్చు.


11, జనవరి 2012, బుధవారం

తిరుప్పావై - పాశురము 27





తిరుప్పావై
- పాశురము 27


కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్.

నోము ఫలంగా సంపదల్ని కోరడం

గోవిందా ! నీ వు శత్రువులందర్నీ గెలిచే శౌర్యగుణసంపద గలవాడవు.
నోముకు కావలసిన పరికరాలను పొందడం మాత్రమే మాకు తృప్తి కాదు.
నోము నోచిన తర్వాత లోకులంతా మెచ్చుకొనేటట్లుగా
వజ్రవైడూర్యాలు పొదిగిన చేతిగాజులు, చెవికమ్మలు, కర్ణపుష్పాలు, భుజకీర్తులు,
కాళ్ళకు కడియాలు మొదలైన అనేక నగలు, సొమ్ములు మేము అలంకరించుకోవాలి.
అంతమాత్రమే కాదు. మంచి మంచి పట్టువస్త్రాలు ధరించాలి.
ఆ తర్వాత స్వామీ ! మీతో కలిసి కమ్మని పాలన్నంలో దండిగా నేతిని వేసుకొని,
ఆపాయసాన్ని జుర్రుకుంటూ ఆనందంగా గడపాలి. మమ్మల్ని అలా అనుగ్రహించుమయ్యా స్వామీ !
అప్పుడే కదా మా వ్రతం ఫలించినట్లు అవుతుంది.


10, జనవరి 2012, మంగళవారం

తిరుప్పావై - పాశురము 26




తిరుప్పావై
- పాశురము 26

మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.


నోము సామాగ్రికై గోదాదేవి ప్రార్థించడం

స్వామీ ! ఆశ్రయించినవాళ్ళను అత్యంత ప్రీతితో రక్షించేవాడా !
ఇంద్రనీలమణివంటి నల్లనిమేనితో నిగనిగ మెరుస్తున్న శ్యామసుందరా !
ఈ మార్గశిరమాసంలో వ్రతం ఆచరించడానికి పెద్దలు నిర్దేశించిన కొన్ని వస్తువులు మాకు కావాలి.
పాలవలె తెల్లగా మెరుస్తూ , ధ్వనిచేత లోకాలన్నింటిని కంపింపజేసే నీ పాంచజన్యశంఖంలాంటి శంఖాలూ,
ఇంకా మంగళాశాసన సమయాన మోగించే పెద్దపెద్ద వాద్యాలూ,
మంగళాశాసకులైన అచార్య స్వాములూ, మంగళదీపాలూ, మంగళ పతాకాలూ……
ఇవన్నీ మాకు నిండు దయతో ఇస్తూ మావ్రతాన్ని సిద్దింపజేయుము దేవా !

9, జనవరి 2012, సోమవారం

తిరుప్పావై - పాశురము 25




తిరుప్పావై - పాశురము 25


ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.


గోదాదేవి పురుషార్థాలను కోరడం

ఓ కృష్ణా ! దేవకీదేవికి పుత్రునిగాజన్మించావు. రాత్రే యశోదకుపెంపుడు బిడ్డవై రహస్యంగా పెరుగుతుండగా,
నిన్ను చంపడానికి చేసిన దురాలోచనను వమ్ముచేసి కంసునికి కడుపుమంటను రగిల్చిన స్వామీ !
నిన్ను ఆశ్రయించిన మాపై మిక్కిలి ప్రేమగలవాడా ! మా ప్రార్థనల్ని ఆలకించు.
మేము పురుషార్థాలను కోరడానికి ఇక్కడికి వచ్చాము.
వాటిని మాకు అనుగ్రహించితే నీ శౌర్యాన్ని, మా క్లేశాలన్నీ తొలగేటట్లుగా కీర్తించి సంతోషిస్తాము.
ఇదే మా వ్రతంయొక్క పరమార్థం స్వామీ !

8, జనవరి 2012, ఆదివారం

తిరుప్పావై - పాశురము 24




తిరుప్పావై
- పాశురము 24

అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి

కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.

గోదాదేవి పాడిన మంగళా శాసనం

పూర్వం లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామీ ! నీ పాదాలకు మంగళం !
లంకలోని రక్కసుల్ని అందర్నీ మట్టుపెట్టినవాడా ! నీ బాహుబలానికి శుభమంగళం !
శకటాసురుణ్ణి చిన్నపాదాలతో తన్నిన స్వామీ ! నీ కీర్తికి మంగళం !
వత్సాసురుణ్ణి ఒడిసెలరాయివలె విసిరివేసి, కపిత్థాసురుని కూల్చివేసిన బలశాలీ !
నీ అడుగులకు మంగళం ! శుభమంగళం !!
గోవర్ధన గిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామీ నీ కృపకు దివ్య మంగళం !
శత్రువులను కూల్చే నీ చేతి దివ్యాయుధానికి జయమంగళం ! నిత్యశుభమంగళం !!
అని ఈ విధంగా ఈ రోజు స్వామివారి శౌర్యాన్ని గానం చేయడమే మా వ్రతం.
కనుక స్వామీ పఱై పురుషార్థాలను అనుగ్రహించి
మా వ్రతాన్నిపూర్తిగాసిద్దింపచేయవలసింది



7, జనవరి 2012, శనివారం

తిరుప్పావై - పాశురము 23




తిరుప్పావై - పాశురము 23

మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్

యదుకిశోరానికి గోదాదేవి విన్నపాలు

వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి, వళ్ళు సాగదీసి విరుచుకొని,
గగుర్పాటుగా వళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే,
అవిసెపుష్పంవలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న కన్నయ్య!
శయన మందిరంనుండి బయలు వెడలి కొలువుమంటపానికి విజయంచేసి
సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు విని అనుగ్రహించుమయ్యా !
అపుడే నీ దయతో మా వ్రతం తప్పక ఫలిస్తుంది.

6, జనవరి 2012, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 22




తిరుప్పావై
-
పాశురము - 22

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.


శ్రీ గోదా, నీలాదేవులు శ్రీకృష్ణుని దయను కోరడం

భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీరాభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదలివేసి,
నీ మంచము దగ్గరికి వచ్చి, దేవరవారి దయకై కాచుకొనివున్నవారివలె,
మేమూ గుంపుగా వచ్చి నీ దివ్యసన్నిధిలో నిలిచివున్నాము.
కృష్ణా ! మువ్వల నోరులాగ, అరవిరిసిన ఎర్రని తామర మొగ్గవలెనున్న
నీ కన్నుల్ని మెల్లమెల్లగ తెరచి నీ చల్లనిచూపు మాపై ప్రసరింపజేయుమా !
ఓ కన్నయ్యా ! సూర్యచంద్రులు ఉదయించినట్లుగా మనోహరమైన నీ రెండు కన్నులతో
మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి.
అప్పుడే కదా మా వ్రతం సపలమవుతుంది.

5, జనవరి 2012, గురువారం

తిరుప్పావై - పాశురము 21




తిరుప్పావై
- పాశురము
21

ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్

నీలాదేవి గోదాబృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పడం

కుండలు అన్నీ నిండి పొర్లిపోయేవిధంగా పాలను ఇచ్చే ఆవులమందను
దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణా !
నిదుర మేల్కోవయ్యా ! ఆశ్రితరక్షకా ! ప్రపన్నార్తిహరా !
శత్రువులు నీవల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిటికి వచ్చి నీ పాదాల మీద పడి,
మీకు సేవచేస్తున్న రీతిని, మేము పొగడుతూ నీకు మంగళా శాసనం పాడటానికిగానూ,
నీదగ్గరివాళ్ళం అందరమూ వచ్చివున్నాము. దయచేసి మేలుకో !
నీ కల్యాణ గుణగానం చేస్తున్న మాపై నిండుదయతో
మా నోమును సిద్ధింపజేయవలసింది.

4, జనవరి 2012, బుధవారం

తిరుప్పావై - పాశురము 20




తిరుప్పావై
- పాశురము 20

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.


గోదాదేవి తమతోపాటు స్వామిని నీరాడజేయమని ప్రార్థించడం

ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి,
వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా ! ఇక నిద్దుర మేలుకొనవయ్యా!
( కృష్ణయ్య పలుకనందువల్ల )
స్వర్ణ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎర్రని పెదవులు,
సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీ మహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ !
నీవైనా నిద్ర మేల్కొనవమ్మా! మానోమునకు కావలసిన ఆలవట్టం, అద్దం మున్నగునవి ఇచ్చి
నీ ప్రియుడైన కృష్ణయ్యతో పాటు మమ్మల్నీ ఇప్పుడే నీరాడజేయవమ్మా !
మేము చేస్తున్న ఈ నోమును ఫలింపజేయవమ్మా !


3, జనవరి 2012, మంగళవారం

తిరుప్పావై - పాశురము 19




తిరుప్పావై - పాశురము 19

కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.


శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పమని దేవేరిని ప్రార్ఠించడం

నాలుగుమూలల్లో దీపపు సెమ్మెలు వెలుగుతుండగా, దంతపుకోళ్ళ మంచమ్మీద ,
సుతిమెత్తని దూదిపరుపుపై, జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకొన్న,
నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా ! నోరు తెరచి ఒక్కమాటైనా మాటాడరాదా !
(శ్రీకృష్ణుడు ఉలుకడు, పలుకడు )

కాటుక పెట్టుకొన్న అందమైన కన్నులుగల నీలాసుందరీ !
ప్రేమాస్పదుడైన నీ పతిని ఎంత పొద్దుపోయినా నిద్రలేపేందుకు నీకు మనసొప్పనేలేదా!
నీ స్వామిని క్షణకాలమైనా నీవు విడిచి పెట్టేదానివిగా కన్పడడంలేదు .
ఇది నీ స్వభావానికి తగని పని. అమ్మా నీలాదేవీ !
స్వామివారితో కూడా మేల్కొని మా నోమును ఫలింపజేయుమమ్మా !


2, జనవరి 2012, సోమవారం

తిరుప్పావై - పాశురము 18





తిరుప్పావై - పాశురము 18

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.

నీలాసుందరీదేవికి మేలుకొలుపు

మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని
భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా !
ఓ నీలాసుందరీదేవీ ! నిద్ర మేలుకోవమ్మా !
కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ !
నిద్దుర లేచి తలుపు తెరువు ! అంతటా కోళ్ళు కూస్తున్నవి .
గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి.
పూలబంతులను పట్టుకొన్న అందమైన చేతివేళ్ళుగల శుభాంగీ !
నీ నాథుడగు శ్రీకృష్ణుని గుణాలను కీర్తించేందుకు మేమందరం వచ్చివున్నాము.
చూడ ముచ్చటైన నీ చేతిగాజులు గల్లుగల్లుమని శబ్దం చేస్తుండగా
కెందామరలవంటి సొంపైన నీ చేతులతో తలుపు తీయవమ్మా !
ఓ నీలాదేవీ! తలుపుతీసి మేము నోచుతున్న నోమును పలింప జేయవమ్మా !


1, జనవరి 2012, ఆదివారం

తిరుప్పావై - పాశురము 17





తిరుప్పావై
- పాశురము 17

అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.

శ్రీకృష్ణ బలరాములకు గోదాదేవి మేలుకొలుపు

సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ !
ఓ నందగోపస్వామీ ! నిద్దురమేలుకొనవయ్యా !

మానినీ మణులందరిలోను మిన్నయై వన్నెతెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న
ఓ యశోదమ్మా ! నిద్దుర మేలుకోవమ్మా !!

ఆకాశాన్ని
ఛేదించుకొంటూ పెరిగి లోకాలన్నింటిని త్రివిక్రముడవై కొలిచిన దేవాదిదేవా !
శ్రీకృష్ణ ! నిదురచాలించి మేలుకో స్వామీ !!

కాళ్ళకు ఎర్రని రాళ్లతో మెరుస్తున్న బంగరు కడియాలు ధరించిన ఓ బలరామా!
నీవూ నీ తమ్ముడు శ్రీకృష్ణునితోకూడ నిద్దురమేల్కొని, మమ్ము ఏలవయ్యా !
మీరంతా లేచి మావ్రతాన్ని ఫలింపజేయరయ్యా !



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)