తిరుప్పావై - పాశురము 26
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.
నోము సామాగ్రికై గోదాదేవి ప్రార్థించడం
స్వామీ ! ఆశ్రయించినవాళ్ళను అత్యంత ప్రీతితో రక్షించేవాడా !
ఇంద్రనీలమణివంటి నల్లనిమేనితో నిగనిగ మెరుస్తున్న శ్యామసుందరా !
ఈ మార్గశిరమాసంలో వ్రతం ఆచరించడానికి పెద్దలు నిర్దేశించిన కొన్ని వస్తువులు మాకు కావాలి.
పాలవలె తెల్లగా మెరుస్తూ , ధ్వనిచేత లోకాలన్నింటిని కంపింపజేసే నీ పాంచజన్యశంఖంలాంటి శంఖాలూ,
ఇంకా మంగళాశాసన సమయాన మోగించే పెద్దపెద్ద వాద్యాలూ,
మంగళాశాసకులైన అచార్య స్వాములూ, మంగళదీపాలూ, మంగళ పతాకాలూ……
ఇవన్నీ మాకు నిండు దయతో ఇస్తూ మావ్రతాన్ని సిద్దింపజేయుము దేవా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి