తిరుప్పావై - పాశురము 17
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్.
శ్రీకృష్ణ బలరాములకు గోదాదేవి మేలుకొలుపు
సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ !
ఓ నందగోపస్వామీ ! నిద్దురమేలుకొనవయ్యా !
మానినీ మణులందరిలోను మిన్నయై వన్నెతెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న
ఓ యశోదమ్మా ! నిద్దుర మేలుకోవమ్మా !!
ఆకాశాన్ని ఛేదించుకొంటూ పెరిగి లోకాలన్నింటిని త్రివిక్రముడవై కొలిచిన దేవాదిదేవా !
శ్రీకృష్ణ ! నిదురచాలించి మేలుకో స్వామీ !!
కాళ్ళకు ఎర్రని రాళ్లతో మెరుస్తున్న బంగరు కడియాలు ధరించిన ఓ బలరామా!
నీవూ నీ తమ్ముడు శ్రీకృష్ణునితోకూడ నిద్దురమేల్కొని, మమ్ము ఏలవయ్యా !
మీరంతా లేచి మావ్రతాన్ని ఫలింపజేయరయ్యా !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి