తిరుప్పావై - పాశురము 27
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్.
నోము ఫలంగా సంపదల్ని కోరడం
గోవిందా ! నీ వు శత్రువులందర్నీ గెలిచే శౌర్యగుణసంపద గలవాడవు.
నోముకు కావలసిన పరికరాలను పొందడం మాత్రమే మాకు తృప్తి కాదు.
నోము నోచిన తర్వాత లోకులంతా మెచ్చుకొనేటట్లుగా
వజ్రవైడూర్యాలు పొదిగిన చేతిగాజులు, చెవికమ్మలు, కర్ణపుష్పాలు, భుజకీర్తులు,
కాళ్ళకు కడియాలు మొదలైన అనేక నగలు, సొమ్ములు మేము అలంకరించుకోవాలి.
అంతమాత్రమే కాదు. మంచి మంచి పట్టువస్త్రాలు ధరించాలి.
ఆ తర్వాత స్వామీ ! మీతో కలిసి కమ్మని పాలన్నంలో దండిగా నేతిని వేసుకొని,
ఆపాయసాన్ని జుర్రుకుంటూ ఆనందంగా గడపాలి. మమ్మల్ని అలా అనుగ్రహించుమయ్యా స్వామీ !
అప్పుడే కదా మా వ్రతం ఫలించినట్లు అవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి