తిరుప్పావై - పాశురము 20
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్.
గోదాదేవి తమతోపాటు స్వామిని నీరాడజేయమని ప్రార్థించడం
ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి,
వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా ! ఇక నిద్దుర మేలుకొనవయ్యా!
( కృష్ణయ్య పలుకనందువల్ల )
స్వర్ణ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎర్రని పెదవులు,
సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీ మహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ !
నీవైనా నిద్ర మేల్కొనవమ్మా! మానోమునకు కావలసిన ఆలవట్టం, అద్దం మున్నగునవి ఇచ్చి
నీ ప్రియుడైన కృష్ణయ్యతో పాటు మమ్మల్నీ ఇప్పుడే నీరాడజేయవమ్మా !
మేము చేస్తున్న ఈ నోమును ఫలింపజేయవమ్మా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి