తిరుప్పావై - పాశురము 25
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్.
గోదాదేవి పురుషార్థాలను కోరడం
ఓ కృష్ణా ! దేవకీదేవికి పుత్రునిగాజన్మించావు.ఆ రాత్రే యశోదకుపెంపుడు బిడ్డవై రహస్యంగా పెరుగుతుండగా,
నిన్ను చంపడానికి చేసిన దురాలోచనను వమ్ముచేసి కంసునికి కడుపుమంటను రగిల్చిన స్వామీ !
నిన్ను ఆశ్రయించిన మాపై మిక్కిలి ప్రేమగలవాడా ! మా ప్రార్థనల్ని ఆలకించు.
మేము పురుషార్థాలను కోరడానికి ఇక్కడికి వచ్చాము.
వాటిని మాకు అనుగ్రహించితే నీ శౌర్యాన్ని, మా క్లేశాలన్నీ తొలగేటట్లుగా కీర్తించి సంతోషిస్తాము.
ఇదే మా వ్రతంయొక్క పరమార్థం స్వామీ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి