Keblinger

Keblinger

2, ఏప్రిల్ 2015, గురువారం

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా



నిన్నుగని శరణమని




సాయిబాబా .. సాయిబాబా .. సాయిబాబా 
సాయిబాబా .. సాయిబాబా .. సాయిబాబా  

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 

దాతవని తలచుకుని జోతలిడే వేళా 
దైవం తలవూపుతుంది కాదా 
దైవం తలవూపుతుంది కాదా 

రాముడైన రహీమైన నానకైన క్రీస్తైనా 
పరమాత్ముని ప్రతినిధులన్నావు 
మతం పేర కులం పేర మత్సరాలు తగదంటూ 
మానవతకు జోతులెత్తినావు

కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు 
ఇలకే అపరంజి వెలుగు నీవు
ఇలకే అపరంజి వెలుగు నీవు 
ఆ.. ఆ..  ఇలకే అపరంజి వెలుగు నీవు 

వ్యాధులను నివారించి బాధలను నిరోధించి 
ఆర్తులకు సేదతీర్చినావు
శరణాగతులందరికీ సద్గతులను కలిగించి 
సమతా మూర్తివై నిలిచినావు 

భిక్ష స్వీకరించి ప్రాణభిక్ష పెట్టినావు 
కదిలే కళ్యాణరాశి  నీవు .. కదిలే కళ్యాణరాశి  నీవు
కదిలే కళ్యాణరాశి  నీవు .. కదిలే కళ్యాణరాశి  నీవు

ఆదియైన అంతమైన అందని వేదాంతమైన 
అంతా నీలో ఉందన్నావు 
పండితులకు పామరులకు యోగులకు త్యాగులకు 
భక్తిమూలమొకటే అన్నావు 

 సహనతరువు పండించిన శాంతిఫలం నీవు 
గురువులకే సద్గురువైనావు .. గురువులకే సద్గురువైనావు
గురువులకే సద్గురువైనావు .. గురువులకే సద్గురువైనావు 

నిన్నుగని శరణమని సన్నుతించు వేళా
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 

జన్మ ధన్యమవుతుంది బాబా 
జన్మ ధన్యమవుతుంది బాబా 
మా జన్మ ధన్యమవుతుంది బాబా 


కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)