Keblinger

Keblinger

31, డిసెంబర్ 2011, శనివారం

తిరుప్పావై - పాశురము 16





తిరుప్పావై
- పాశురము 16

నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం

మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ !
మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న
రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు.
మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం!
విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్ఛాయగలిగిన
ఆ నల్లని కన్నయ్య, మాకు ఒక వాద్యాన్ని ( వరాన్ని )
ఇస్తానని నిన్ననే బాసచేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు.
అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ
ఆ కృష్ణమూర్తిని నిద్ర లేపటానికి వచ్చివున్నాం. ఓ ద్వారపాలకా !
తొలుదొల్తనే మమ్ము నోటితో వారించకు. దయచేసి తలుపు తెరువు.
మేము వ్రతం ఆచరించవలసి వుంది.

30, డిసెంబర్ 2011, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 15





తిరుప్పావై - పాశురము 15


ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, పోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.


ఒక కీరవాణిని మేల్కొల్పుట ( ఇది సంభాషణ రూపంలో సాగినది )

చెలికత్తెలు ఓసీ ! చిలుకపలుకుదానా ! ఇంకను నిద్రిస్తూ వున్నావా !
కీరవాణి - ష్, వళ్ళు అదరేట్లు ఏమిటా అరుపు ! ఇదే లేచి వస్తున్నా .
చెలికత్తెలు చతురవాక్కులు కలదానా ! నీ నోరు మాకు తెలియదా !
కీరవాణి - సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని,అందరూ వచ్చినారా !
చెలికత్తెలు అందరూ వచ్చినారు. నీవే వచ్చి లెక్కించుకో !
కువలయాపీడమనే మత్తగజాన్ని సంహరించినవాడూ,
కంసారి, శత్రుమర్దనుడు, మహామాయగాడు అయిన శ్రీకృష్ణుని లీలల గూర్చి నోరారా కీర్తిద్దాం.
ఈ వ్రతానికి మమ్ము అనుసరించు.


29, డిసెంబర్ 2011, గురువారం

తిరుప్పావై - పాశురము 14





తిరుప్పావై - పాశురము 14

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.


వెలుగురేకలు విచ్చుకున్నవి, లేవమ్మా! లే !

కన్యకామణీ ! మమ్ము మేల్కొలుపుతానాని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా !
ఏమిటీ ? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా?
అటుచూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరలు వికసించాయి !
నల్లకలువలు ముడుచుకొన్నాయి ! అటు వీధిలో కాషాయాంబరధారులైన సన్యాసులు
దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు.
మమ్ములను లేపెదనని మాటలు చెప్పినదానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా ?
శంఖ చక్రాలు ధరించిన, పద్మాలవంటి కన్నులుగలవాడైన
శ్రీ కృష్ణభగవానుని లీలల గూర్చి నోరార గానం చేయడానికి నిద్రలేచిరావమ్మా !
ఇది మన వ్రతం కదా!


28, డిసెంబర్ 2011, బుధవారం

తిరుప్పావై - పాశురము 13





తిరుప్పావై
- పాశురము 13


పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్.

మరో సుందరాంగిని మేల్కొల్పడం

ఓ గోపికా ! బకరాక్షసుణ్ణి చీల్చిచెండాడిన శ్రీకృష్ణభగవానుని,
రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని
కల్యాణగుణలీలలను ప్రకటించే పాటలను పాడుకొంటూ
మనకంటే చిన్నవయసుగల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు.
తెలతెలవారుతూవుంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు.
గూళ్ళను వదలిన పక్షులు రొదచేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి.
పద్మములవంటి, జింకవంటి అందమైన కన్నులు కలదానా !
చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిదిరిస్తున్నావా ?
ఈ శుభదినాన ఇంకా నిద్రేల ? మేలుకో, కపటం మాని మాతో కలు,
జాగు చేయకు, వ్రతమాచరించడానికి మాతోరా !

27, డిసెంబర్ 2011, మంగళవారం

తిరుప్పావై - పాశురము 12




తిరుప్పావై - పాశురము 12


కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.


కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పడం


ఓ గోపికామణీ ! తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపువిని,
వాటిమీద వాత్సల్యంచేత పొదుగులు చేపి,
వాటినుండి పాలు కారిపోవడంవల్ల ఇంటి ముంగిట బురద బురదగా
అయిన పశుసంపద వృద్ధిపొందిన గోపకునికి చెల్లెలైనదానా !
తలలపైన కురిసే మంచువల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట కాచుకొనివున్నాం.
తన సతిని చెరబట్టిన లంకేశుని చంపినట్టి శ్రీరామచంద్రుని
గూర్చి పాడుతున్న మమ్ము చేరరావే ! చేరి నీవు నోరారా పరమగానం చెయ్యవే !
మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా వినీకూడ రాకున్నావటే !
ఇది ఏమి విడ్డూరం ! ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావలసింది.

26, డిసెంబర్ 2011, సోమవారం

తిరుప్పావై - పాశురము 11





తిరుప్పావై - పాశురము 11


కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

సుగుణాలరాశి, అందాలకుప్ప అయిన ఒక గోపికను మేల్కొల్పడం

ఓ గోపికామణీ ! ఒకవైపు దూడలతో గూడియుండు
ఆవుల బరువైన పొదుగులనుండి పాలుపితుకుతూ,
మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్యసాహసాలతో విలసిల్లుతూ,
దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారుతీగవు నీవు !
పుట్టనుండి వెడలు పాముపడగవంటి జఘనభాగము కలిగిన అందాలభరణివే నీవు !
వనమయూరము వంటి చాయ కలిగిన వన్నెలాడీ !
లేచిరమ్ము. చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ
నీవాకిటి ముందరికి వచ్చి, నీలమేఘశ్యాముడగు
శ్రీకృష్ణుని నోరార గానం చేస్తున్న, నీవు ఉలకవు పలుకవు.
లక్ష్మీకరములైన శుభలక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగని పని.
వెంటనే లేచి వ్రతాచరణమునకు మమ్ము అనుసరించవలసింది

25, డిసెంబర్ 2011, ఆదివారం

తిరుప్పావై - పాశురము 10





తిరుప్పావై
- పాశురము 10


నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

శ్రీకృష్ణునితో ఎక్కువ చనువు గల్గిన గోపికను మేల్కొల్పడం

ఓ చెలీ ! మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవించుచున్నదానా !
తలుపు బిగించి పడుకొంటివేమే ? తలుపు తియ్యవే ?
పోనీలే తలుపు తియ్యకున్నా పరవాలేదు. ఒక్క మాటైనా నోటితో పలుకరాదా !
నీతోడి ఒక్కమాటకైనా మేము నోచుకోలేదా !
కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడేమోగదా !
అందుకే అంత మొద్దునిద్ర నీకు ఆవహించింది.
దివ్యపరిమళభరితమగు తులసీమాలలను ధరించివున్న
శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించినట్లయితే మనకు కావలసిన కోరికలిస్తాడు.
మా గోపికాబృందమునకు అలంకార ప్రాయమైనదానా !
ఇకనైనా తెలివి తెచ్చుకొని నిద్దురలేచి తలుపు తెరు !
ఈ వేకువన మనమందరం వ్రతమాచరిద్దాం.


24, డిసెంబర్ 2011, శనివారం

తిరుప్పావై - పాశురము 9





తిరుప్పావై - పాశురము 9


తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్

శ్రీమంతురాలైన ఒక గోపికను మేల్కొల్పడం

ఓ మామ కూతురా ! నిదురలేవమ్మా!
మాణిక్య భవనంలో మాణిక్య దీపాల వింతవింత కాంతుల్లో
కమ్మని ధూపసువాసనలమధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నదానా !
నిద్ర లేవరాదటే! మణివాకిలి గడియ తియ్యరాదటే !
అత్తా ! నీబిడ్డను నీవైనా నిద్రలేపు. మా మాటలు వినపడినట్లులేదు. చెవిటిదా ?
ఏమి మాట్లాడటం లేదు మూగదా ? లేక మాటామంతీ లేక నిదురపోవునట్లు
మందుగాని మంత్రంగానివేసినారా !
గొప్ప గొప్ప మాయలు (లీలలు) చేసేవాడా,మాధవా, వైకుంఠనాథుడా అని వేయి విధాల నోరారా
స్వామివారిని గూర్చి మేమందరం గానం చేస్తున్నా కూడా నీ కూతురు నిదుర లేవలేదు.
దయచేసి మా వ్రతాచరణకు మీ ముద్దుల కూతురిని నిద్దురనుండి లేపండి.

23, డిసెంబర్ 2011, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 8





తిరుప్పావై - పాశురము 8


కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.


స్వామి సేవయందు ఆసక్తికల యువతిని మేల్కొల్పడం

ఓ యువతీ ! మేల్కొనవే ! తూర్పున ఆకాశం తెల్లబడింది.
పచ్చిక బయళ్ళలో మంచుచే కప్పబడిన పచ్చికను మేస్తూ
పశువులు స్వేచ్చగాతిరుగాడుతున్నాయి.
స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానేవెళ్ళేవారిని దారిలోనే ఆపివుంచి
నిన్ను పిలుచుటకై మేము వచ్చి నిలిచివున్నాము.
శ్రీ కృష్ణుని సేవయందు ఆసక్తికల ఓ సుందరాంగీ మేలుకో !
మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది.
చాణూర ముష్టికులనే పేరుగల మల్లవీరులను మట్టుపెట్టి
విలసిల్లు విష్ణుమూర్తిని జేరి పరిపరి విధముల పరమగానములతో కీర్తించినచో
ఆ స్వామి అయ్యో వీరు ఇందరు వచ్చినారే అని అత్యంత కరుణతో
మనలను అనుగ్రహిస్తాడు. కనుక ఓ గోపికా !
మేలుకొని వ్రతాచరణకు మమ్ము అనుసరించవమ్మా !

22, డిసెంబర్ 2011, గురువారం

తిరుప్పావై - పాశురము 7





తిరుప్పావై - పాశురము 7


కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పీచ్చరవం కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

నోము విషయం తెలిసీ నిద్రిస్తున్న నాయకిని మేల్కొల్పడం

ఓ యువతీ ! మాకు నాయకివై, నోము నోచు విషయం అంతా తెలిసీ ఇంకా నిద్రిస్తున్నావా ?
ఎంత విడ్డూరం ! ఇంకా తెల్లవారనే లేదంటావా ! భలేదానివే !
అదిగో భరద్వాజ జంటపక్షులు రాత్రి అంతా కలిసివుండి
ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రొదచేయడం నీకు వినపడాలేదా !
పోనీలే, ఓ చిన్నదానా ! గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట నీకు కనపడకపోవచ్చు.
చిలుకునప్పుడు వారి మెడలో మంగళసూత్రంలోని రెండు తాళిబొట్లు,
కాసులపేరులు రాచుకొని
కలిగే చప్పుళ్ళు, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినపడనేలేదా !
మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్దమైనా వీనుల విందుగా వినగరాలేదా !
మాకు నాయకివైన చిన్నదానా! పరంధాముడైన, సర్వార్థసాధకుడైన
శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ పరమగానం చేస్తుండగా
నీవ్ వింటూ కూడ నిదురలో ఉన్నావా ! ఇకనైనా వేగిరమే మేలుకో !
మనమంతా వ్రతమాచరించాలిగదా !

21, డిసెంబర్ 2011, బుధవారం

తిరుప్పావై - పాశురము 6





తిరుప్పావై
- పాశురము 6

పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్

వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు

కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి

వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై

ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్

మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్

ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.


గోదాదేవి
నోము తెలియని కన్నియను మేల్కొల్పడం

ఓ చెలీ ! ఇంకనూ నిద్రమత్తులో జోగుతున్నావా !లెమ్ము త్వరత్వరగా లెమ్ము. మేల్కొనుము.
ఈ వేకువజామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గూళ్ళను వదలిపెట్టి పోతున్నాయి.
ఈ ప్రశాంత సమయంలో గరుడవాహనుడైన శ్రీ స్వామివారిని మేల్కొల్పే
ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినపడనే లేదా !
ఓ చిన్నదానా మేల్కొనుము . చనుబాలు తాగి పూతనను సంహరించినవాడు,
తన చిన్ని పాదములచే శకటాసురుణ్ణి భంజించినవాడు
అయిన నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరమగానములు వీనుల విందుగా వినుము.
జలధిలో అనంతుడనే శేషునిపై యోగనిద్రలో శయనించిన జగన్నాథుని గూర్చి,
ఈ వేకువన నిద్ర మేల్కొన్న మునులు, పరమయోగులు హరి హరీ అని ఆహ్లాదంగా,
ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనం నీకు వినరాలేదా !
ఓ బాలా ! ఇకనైనా త్వరగా మేల్కొనుము.
మనం వ్రతం ఆచరించవలె గదా !



20, డిసెంబర్ 2011, మంగళవారం

తిరుప్పావై -పాశురము 5




తిరుప్పావై
-పాశురము 5

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్.


శ్రీకృష్ణ నామ గానంతో సర్వపాపహరణం


మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ,
గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ,
గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ,
అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి,
దాసానుదాసులమై పూలతో పూజించుదాం.
నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు గతంలో చేసిన పాపాలూ...
అటు
భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నికి తగిలిన దూదివలె కాలిపోతాయి.
కనుక గోవిందుని కల్యాణ గుణ లీలా విశేషాలను,శ్రీనామాలను గానం చేయటమే ఉత్తమం.
ఇదే కదా మన వ్రతం.

19, డిసెంబర్ 2011, సోమవారం

తిరుప్పావై - పాశురము 4

తిరుప్పావై - పాశురము 4





ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

వర్షం కోసం మేఘునికి విన్నపం


ఓ వానదేవుడా ! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం.
ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది.
మరి నీళ్ళు నీకెక్కడివంటావా ! సముద్రానికి వెళ్ళు.
వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు.
విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని చాయను పొందు.
జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను,
శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన
శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు.
గోవిందుని పొందగోరు మేమంతా ఈ మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.

18, డిసెంబర్ 2011, ఆదివారం

తిరుప్పావై - పాశురము 3

తిరుప్పావై - పాశురము 3





ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

నోము నోచడడంవల్ల లోకానికి కలిగే మేలు

మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన
పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ
సంకల్పం చెప్పుకొని,నోముపట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి.
పాపాలు తొలగుతాయి. రోగాలు, దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు.
దేశమంతా నెలకు మూడువానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి.
సమయంలో ఎగసిపడే చేపలతో నీటికయ్యలూ, మత్తుగా తేనెతాగి నిద్రిస్తున్న
తుమ్మెదలతో నిండిన ఎర్రనికలువలు నయన మనోహారంగా దర్శనమిస్తాయి .
నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలుపితికినా కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి.
ఇట్టి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రారే ! అని ఆండాళ్ తన చెలియలతో చెప్పి పిలుస్తోంది.

17, డిసెంబర్ 2011, శనివారం

తిరుప్పావై - పాశురము -2


తిరుప్పావై
- పాశురము -2






వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు

చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

గోదాదేవి నోమునకు నియమాలు తెలుపుట

లౌకిక సుఖాలను లెస్సగా పొందుతున్న గోప కన్నియల్లారా !
పారలౌకిక సుఖాలకై చేసే వ్రత నియమాలను తెలియండి.
వేకువజామునే చన్నీట జల్లులాడి
క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి.
వ్రత సమయంలో పాలూ, నేయీ తాగరాదు. కన్నుల కాటుక పెట్టరాదు.
జడలో పూలు ముడువరాదు. చేయరాని పనులు చేయరాదు.
చేతనైన పనులు పెద్దలకు చేసిపెట్టాలి. పనికిరాని మాటలతో పరుల నొప్పింపరాదు.
పేదసాదలకు తోచినంత దానమివ్వాలి.
ఇలాగ వ్రత నియమాలను పాటిస్తూ పరంధాముని సేవింతము రారే !

16, డిసెంబర్ 2011, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 1




తిరుప్పావై
- పాశురము 1


మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.

గోదాదేవి నోముకై గోపికలను పిలుచుట

చెలియల్లారా ! రండి రారండీ !సంపత్కరములయిన సర్వాభరణములతో
విరాజిల్లు
తున్న ఓ గోపకన్నియలారా రండీ రారండీ!
ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం. అందులోను
పున్నమి వెన్నెల పిండిఆరబోసినట్లు ఉన్న వేకువజాము.
పోటుమగడైన నందునిఅనుంగుబిడ్డను సేవింతమురారే !

నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి అయిన
ఆ బాలకిశోరాన్ని సేవించి
తృప్తిదీర సర్వశుభములు పొందుటకు
వేకువన చన్నీట జల్లులాడి సేవించుటకుపోవుదము రారే !
ఇది మన వ్రతం కదా !


ధనుర్మాసం - తిరుప్పావై పాశురాలు



ఆండాళ్ లేదా గోదాదేవి ,శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె.ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు.యుక్త వయస్సుకి వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు,

అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది, రోజు రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి,చాలా దుఃఖించి స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది,దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా బాధపడుతుంటే స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.


తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావై " వ్రతాచరణ చేస్తారు. తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది..వివాహానంతరం గోదాదేవి చిద్విలాసునిలో లీనమవుతుంది.  అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి
మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన "తిరుప్పావై" చాలా ప్రసిద్ధమైనది.దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు


ధనుర్మాసంలో పఠించే 30 పాశురాలను ఈ లింక్ లో చూడొచ్చు 

  http://raaji-bhaktiprapancham.blogspot.in/2015/05/30.html



10, డిసెంబర్ 2011, శనివారం

రమణ మహర్షి ...

దత్త బోధ సుధ





నామబేధాన్ని బట్టి దేవుళ్ళు ఎందరో వున్నారని అనుకోవటం అపోహ
దేవుడు ఒక్కడే!
భక్తుల కోసం తానే అనేక రూపాలు ధరించి, ఎవరూ పేరుతోపిలిచినా
పలుకుతూ వారిని ఆదుకుంటూ ఉంటాడు..


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)