తిరుప్పావై - పాశురము 4
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్
వర్షం కోసం మేఘునికి విన్నపం
ఓ వానదేవుడా ! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం.
ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది.
మరి నీళ్ళు నీకెక్కడివంటావా ! సముద్రానికి వెళ్ళు.
వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు.
విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని చాయను పొందు.
జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను,
శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన
శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు.
గోవిందుని పొందగోరు మేమంతా ఈ మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి