తిరుప్పావై - పాశురము -2
వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
గోదాదేవి నోమునకు నియమాలు తెలుపుట
లౌకిక సుఖాలను లెస్సగా పొందుతున్న ఓ గోప కన్నియల్లారా !
పారలౌకిక సుఖాలకై చేసే ఈ వ్రత నియమాలను తెలియండి.
వేకువజామునే చన్నీట జల్లులాడి
క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి.
ఆ వ్రత సమయంలో పాలూ, నేయీ తాగరాదు. కన్నుల కాటుక పెట్టరాదు.
జడలో పూలు ముడువరాదు. చేయరాని పనులు చేయరాదు.
చేతనైన పనులు పెద్దలకు చేసిపెట్టాలి. పనికిరాని మాటలతో పరుల నొప్పింపరాదు.
పేదసాదలకు తోచినంత దానమివ్వాలి.
ఇలాగ ఈ వ్రత నియమాలను పాటిస్తూ పరంధాముని సేవింతము రారే !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి