తిరుప్పావై - పాశురము 6
పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
గోదాదేవి నోము తెలియని కన్నియను మేల్కొల్పడం
ఓ చెలీ ! ఇంకనూ నిద్రమత్తులో జోగుతున్నావా !లెమ్ము త్వరత్వరగా లెమ్ము. మేల్కొనుము.
ఈ వేకువజామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గూళ్ళను వదలిపెట్టి పోతున్నాయి.
ఈ ప్రశాంత సమయంలో గరుడవాహనుడైన శ్రీ స్వామివారిని మేల్కొల్పే
ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినపడనే లేదా !
ఓ చిన్నదానా మేల్కొనుము . చనుబాలు తాగి పూతనను సంహరించినవాడు,
తన చిన్ని పాదములచే శకటాసురుణ్ణి భంజించినవాడు
అయిన నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరమగానములు వీనుల విందుగా వినుము.
జలధిలో అనంతుడనే శేషునిపై యోగనిద్రలో శయనించిన జగన్నాథుని గూర్చి,
ఈ వేకువన నిద్ర మేల్కొన్న మునులు, పరమయోగులు హరి హరీ అని ఆహ్లాదంగా,
ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనం నీకు వినరాలేదా !
ఓ బాలా ! ఇకనైనా త్వరగా మేల్కొనుము.
మనం వ్రతం ఆచరించవలె గదా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి