ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
నోము నోచడడంవల్ల లోకానికి కలిగే మేలు
మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ
సంకల్పం చెప్పుకొని,నోముపట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి.
పాపాలు తొలగుతాయి. రోగాలు, దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు.
దేశమంతా నెలకు మూడువానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి.
ఆ సమయంలో ఎగసిపడే చేపలతో నీటికయ్యలూ, మత్తుగా తేనెతాగి నిద్రిస్తున్న
తుమ్మెదలతో నిండిన ఎర్రనికలువలు నయన మనోహారంగా దర్శనమిస్తాయి .
నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలుపితికినా కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి.
ఇట్టి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రారే ! అని ఆండాళ్ తన చెలియలతో చెప్పి పిలుస్తోంది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి