Keblinger

Keblinger

31, జులై 2016, ఆదివారం

ఒకపరి కొకపరి ఒయ్యారమై



ఒకపరి కొకపరి ఒయ్యారమై



ఒకపరి కొకపరి ఒయ్యారమై
ఒకపరి కొకపరి ఒయ్యారమై
మొగమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి ఒయ్యారమై

జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి
జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి
జిగిగొన నలువంక చిందగాను

జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి
జిగిగొన నలువంక చిందగాను

మొగి చంద్రముఖి ఉరమున నిలిచేగాన
 మొగి చంద్రముఖి ఉరమున నిలిచేగాన
పొగరు వెన్నెల దిగబోసినట్లుండె
 పొగరు వెన్నెల దిగబోసినట్లుండె

ఒకపరి కొకపరి ఒయ్యారమై
మొగమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి ఒయ్యారమై

మెరయ శ్రి వేంకటేశు మేన సింగారముగాను
మెరయ శ్రి వేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా

మెరయ శ్రి వేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా

మెరుగు బోణి అలమేలు మంగయు తాను
మెరుగు బోణి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘముకూడి మెరసినట్టుండె 
 మెరుపు మేఘముకూడి మెరసినట్టుండె

ఒకపరి కొకపరి ఒయ్యారమై
మొగమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి ఒయ్యారమై


30, జులై 2016, శనివారం

శరణు శరణు సురేంద్ర సన్నుత




శరణు శరణు సురేంద్ర సన్నుత


శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

శరణు రాక్షస గర్వ సంహార
శరణు వేంకట నాయక
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి  వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

కమల ధరుడును కమల మిత్రుడు
కమల శత్రుడు పుత్రుడు
కమల ధరుడును కమల మిత్రుడు
కమల శత్రుడు పుత్రుడు

క్రమముతో మీకొలువు కిప్పుడు
కాచినారెచ్చరికయా
క్రమముతో మీకొలువు కిప్పుడు
కాచినారెచ్చరికయా

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

అనిమిషేంద్రులు మునులు
దిక్పతులు అమర కిన్నెర సిధ్ధులు
అనిమిషేంద్రులు మునులు
దిక్పతులు అమర కిన్నెర సిధ్ధులు

ఘనతతో రంభాది కాంతలు
కాచినారెచ్చరికయా
ఘనతతో రంభాది కాంతలు
కాచినారెచ్చరికయా

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగ వచ్చిరి
ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగ వచ్చిరి

విన్నపము వినవయ్య
తిరుపతి వేంకటాచల నాయకా
విన్నపము వినవయ్య
తిరుపతి వేంకటాచల నాయకా

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర
శరణు వేంకట నాయక

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా
శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా

శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీసతి వల్లభా



29, జులై 2016, శుక్రవారం

ఏమని పొగడుదుమే యికనిను



ఏమని పొగడుదుమే యికనిను



ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగా
ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగా

తెలికన్నుల నీ తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మొలకల పొదులివి గదవే
పలుమరు బువ్వుల పానుపులు

ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగా 
ఏమని పొగడుదుమే

తియ్యపు నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివీ 
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు


ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగా 
ఏమని పొగడుదుమే
కైవసమగు నీ కౌగిలే కదవే
శ్రీవేంకటేశ్వరుని సిరి నగరు
తావు కొన్న మీ తమకములే కదే
కావించిన కల్యాణములు

ఏమని పొగడుదుమే యికనిను
ఆమని సొబగుల అలమేల్మంగా 
ఏమని పొగడుదుమే

28, జులై 2016, గురువారం

షిరిడీ వాసా సాయి ప్రభో



షిరిడీ వాసా సాయి ప్రభో



షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా

కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

చాంద్ పాటిల్ ను కలుసుకొని ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

నీ ద్వారములో నిలిచితిమి నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి  లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి  పాము విషము తొలగించి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

భక్త భీమాజీకి క్షయ రోగం  నశియించే ఆతని సహనం 
ఊదీ వైద్యం చేశావు  వ్యాధిని మాయం చేశావు
కాకాజీకి ఓ సాయి  విఠల దర్శనమిచ్చితివి
దామూకిచ్చి సంతానం  కలిగించితివి సంతోషం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

కరుణా సింధు కరుణించి  మా పై కరుణా కురిపించు 
 సర్వం నీకే అర్పితము  పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకునే నిను మేఘా  తెలుసుకుని ఆతని బాధ 
 దాల్చి  శివ శంకర రూపం  ఇచ్చావయ్యా దర్శనము 

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 డాక్టరుకు నీవు రామునిగా బలవంతునకు శ్రీదత్తునిగా
నిమోనికరుకు మారుతిగా   చిదంబరుకు శ్రీ గణపతిగా
 మార్తాన్డుకు  ఖండోబాగా గణూకు సత్య దేవునిగా
నరసింహస్వామిగ జోషీకి దరిశనమిచ్చిన శ్రీ సాయి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభియించు ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 అందరిలోనా నీరూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవెనయా మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము  సాయిని కొలిచెదము

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 భక్తిభావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని
చిత్తముతో సాయీ ధ్యానం చెయ్యండి ప్రతి నిత్యం
బాబా కాల్చిన ధుని ఊది  నివారించును ఆదివ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయే  మన సద్గురువండి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
 
 వందనమయ్యా పరమేశా ఆపద్భాంధవ సాయీశా
మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మేము దరి చేర్చోయీ
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాధ్ మహారాజ్  కీ జై




27, జులై 2016, బుధవారం

లాలనుచు నూచేరు లలన లిరుగడలా



లాలనుచు నూచేరు లలన లిరుగడలా


లాలనుచు నూచేరు లలన లిరుగడలా
బాల గండవర గోపాల నిను చాల
లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవర గోపాల నిను చాల

లాలి..  లాలి..  లాలీ..  లాలీ

ఉదుటుగుబ్బల సరములుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ

లాలి..  లాలి..  లాలీ..  లాలీ

మలయమారుత గతులు మాటికి జెలంగ
పలుకు గపురపుతావి పై పై మెలంగ
బలు గానలహరి యింపుల రాల్గరంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగ

లాలి..  లాలి..  లాలీ..  లాలీ

లలనా జనాపాంగ లలితసుమచాప
జలజలోచన దేవ సద్గుణకలాప
తలపు లోపల మెలగు తత్త్ వప్రదీప
భళిర గండవరేశ పరమాత్మరూప

లాలి..  లాలి..  లాలీ..  లాలీ

లాలనుచు నూచేరు లలన లిరుగడలా
బాల గండవర గోపాల నిను చాల
లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవర గోపాల నిను చాల

లాలి..  లాలి..  లాలీ..  లాలీ


26, జులై 2016, మంగళవారం

శ్రీ విష్ణు షోడశ నామ స్త్రోత్రం



శ్రీ విష్ణు షోడశ నామ స్త్రోత్రం



 ఔషధే చింతయే ద్విష్ణుం 
భోజనేచ జనార్దనం
శయనే పద్మనాభం చ 
వివాహేచ ప్రజాపతిమ్

యుద్ధే చక్రధరం  దేవం 
ప్రవాసేచ త్రివిక్రమం
నారాయణం చ త్యాగేచ 
శ్రీధరం ప్రియ సంగమే

దుస్స్వప్నే స్మర గోవిందం 
సంకటే మధుసూదనం
కాననే నారసింహంచ 
పావకే జలశాయనం

జలమధ్యే వరాహంచ 
పర్వతే రఘునందనం
గమనే వామనంచైవ 
సర్వ కాలేషు మాధవం

షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే


25, జులై 2016, సోమవారం

ఓం జై శివ ఓంకార భజ హర శివ ఓంకార




ఓం జై  శివ  ఓంకార



జై  శివ  ఓంకార  భజ హర  శివ  ఓంకార
బ్రహ్మ  విష్ణు  సదాశివ  అర్ధాంగీ  ధారా
ఓం జై శివ  ఓంకారా

ఏకానన్  చతురానన్  పంచానన్ రాజై
స్వామి పంచానన్ రాజై
హంసానన్ గరుడాసన్ వృషవాహన్ సాజై
ఓం జై శివ  ఓంకారా

దో  భుజ చార్ చతుర్భుజ దశ భుజ అతి సోహై
స్వామి దశ భుజ అతి సోహై
తీనో రూప్ నిరఖ్తే  త్రిభువన్ మన్ మోహే
ఓం జై శివ  ఓంకారా

అక్షమాల వనమాల ముండ్ మాలా ధారీ
స్వామి ముండ్ మాలా ధారీ
చందన్ మృగమద్ చందా సోహై త్రిపురారి
ఓం జై శివ  ఓంకారా

శ్వేతాంబర్ పీతాంబర్ భాగంబర్ అంగే 
స్వామి భాగంబర్ అంగే
సనకాదిక్ బ్రహ్మాదిక్ భూతాదిక్  సంగే 
ఓం జై శివ  ఓంకారా

కర్ కె మధ్య్ కమండలు చక్ర త్రిశూల ధారీ
స్వామి చక్ర త్రిశూల ధారీ 
సుఖ్ కారీ  దుఃఖ్ హారీ జనపాలన్ కారీ
ఓం జై శివ  ఓంకారా

బ్రహ్మ  విష్ణు  సదాశివ్ జానత్  అవివేక
స్వామి  జానత్  అవివేక
ప్రణవాక్షర్ మే శోభిత్ యే తీనో ఏకా
ఓం జై శివ  ఓంకారా

త్రిగుణ శిప్ జీ  కి ఆరతి జో కోయి నర్ గావే
స్వామి జో కోయి నర్ గావే
కహత్ శివానంద్ స్వామి సుఖ్ సంపత్తి పావే
ఓం జై శివ  ఓంకారా

జై  శివ  ఓంకార  భజ హర  శివ  ఓంకార
బ్రహ్మ  విష్ణు  సదాశివ  అర్ధాంగీ  ధారా
ఓం జై శివ  ఓంకారా 




24, జులై 2016, ఆదివారం

ప్రాతః స్మరణ స్తోత్రం -- ఓం బ్రహ్మణే నమః



 ఓం బ్రహ్మణే నమః



ఓం బ్రహ్మణే నమః

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్
యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం
తత్ బ్రహ్మ నిష్కల మహం న చ భూత సఙ్ఘః

ఓం బ్రహ్మణే నమః

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ
యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచం
స్తం దేవ దేవ మజమచ్యుతమాహురగ్ర్యమ్

 ఓం బ్రహ్మణే నమః

ప్రాతర్నమామి తమసః పరమర్క వర్ణం
పూర్ణం సనాతనవదం పురుషోత్తమాఖ్యమ్
యస్మిన్నిదమ్ జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజఙ్గమ ఇవ ప్రతిభాసితం వై

 ఓం బ్రహ్మణే నమః 


23, జులై 2016, శనివారం

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల



మేలుకో శృంగార రాయ..



మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాల మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాల మించిన నిధానమా

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు
ఇందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాల మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల

గతికూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దుగులికేటి రాచిలుకా
సతులు పదారువేల జంట కన్ను కలువలకు
ఇతవై పొడిమిన నా ఇందు బింబమా

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాల మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల

వరుస కొలనిలోని వారి చన్ను కొండలపై
నిరతి వాలిన నా నీల మేఘమా
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్ప తరువా

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాల మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల


22, జులై 2016, శుక్రవారం

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగా నాంచారమ్మ



అమ్మమ్మ ఏమమ్మ..



 అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ .. ఓయమ్మా
 అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ  ... ఓయమ్మా 

అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ

నీరిలోన తల్లడించీ నీకే తలవంచీ
నీరికింద పులకించి నీ రమణుడు
గోరికొన చెమరించి కోపమే పచరించీ
సారెకు నీ అలుక యిట్టే చాలించవమ్మా

 అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ

నీకు గానే చెయ్యిచాచి నిండా కోపము రేచీ
మేకొని నీ విరహాన మేనూ వెంచీనీ
ఈకడాకడీ సతుల హృదయమే పెరరేచీ
ఆకూ మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

 అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ  ... ఓయమ్మా
అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ

చక్కదనములె పెంచీ సకలముగా దలంచీ
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీనీ 
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతనినిట్టే అలరించవమ్మా

 అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ  ... ఓయమ్మా
అమ్మమ్మ మమ్మ అలమేల్మంగా నాంచారమ్మ
తమియింట నలరుకొమ్మ


21, జులై 2016, గురువారం

చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి



చరణములే నమ్మితి



చరణములే నమ్మితి చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి

వారధి గట్టిన వర భద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య
చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి

ఆదిశేష నన్నరమర చేయకు
అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య
చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి

వనమున రాతిని వనితగ జేసిన
చరణం చరణం చరణం నీ దివ్య
చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి

పాదారవిందమే యాధారమని నేను
పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య
చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి


బాగుగ నన్నేలు భద్రాచల రామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య
చరణములే నమ్మితి
నీ దివ్య చరణములే నమ్మితి



20, జులై 2016, బుధవారం

ఏతీరుగ నను దయజూచెదవో



ఏతీరుగ నను దయజూచెదవో



ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

శ్రీ రఘునందన సీతారమణా 
శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను 
కన్నది కానుపు రామా

ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

క్రూరకర్మములు నేరక జేసితి 
నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె 
దైవశిఖామణి రామా

ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

మురిపెముతో నా స్వామివి నీవని 
ముందుగ తెల్పితి రామా
మరవక యిక అభిమానముంచు 
నీ మరుగుజొచ్చితిని రామా

ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా
 
గురుడవు నామది దైవము నీవని 
గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు 
క్రూరుడ నైతిని రామా

ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

 నిండితి వీ వఖిలాండకోటి 
బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీ నామము దలచిన 
నిత్యానందము రామా
 
ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

వాసవ కమల భవాసురవందిత 
వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన 
భద్రాద్రీశ్వర రామా

ఏతీరుగ నను దయజూచెదవో 
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను 
నళినదళేక్షణ రామా

వాసవనుత రామదాస పోషక 
వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె 
దాశరధీ రఘురామా



19, జులై 2016, మంగళవారం

సాయి దివ్యరూపం జ్ఞానకాంతి దీపం



సాయి దివ్య రూపం



సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం

ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
శ్రీ సాయి చరితం చిదానంద భరితం
చిదానంద భరితం .. చిదానంద భరితం

సాయి దివ్య రూపం జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం

ఏ వేళనైనా ఎంత వారికైనా
ఏ వేళనైనా ఎంత వారికైనా
సాయి వచన సారం కైవల్య తీరం
కైవల్య తీరం .. కైవల్య తీరం

సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం

మా సాయి బాబా మనసు వెండి కొండ
మా యోగి బాబా మాట మల్లెదండ
సాయి చేతి చలువ వేయి కోట్ల విలువ
ఆ లీలలన్ని అభినుతించగలమా

సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం
సాయి భవ్యనామం సర్వ పుణ్య ధామం

సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం
సాయి దివ్య రూపం



ఇక్ష్వాకు కుల తిలక యికనైన పలుకవె రామచంద్రా



ఇక్ష్వాకు కుల తిలక..



ఇక్ష్వాకు కులతిలక 
యికనైన పలుకవె రామచంద్రా
నన్ను రక్షింపకున్నను 
రక్షకులెవరయ్య  రామచంద్రా

చుట్టు ప్రాకారములు 
సొంపుగ కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు పట్టె 
పదివేల వరహాలు రామచంద్రా

గోపుర మంటపాలు 
కుదురుగ కట్టిస్తి రామచంద్రా
నను క్రొత్తగ చూడక 
ఇత్తరి బ్రోవుము రామచంద్రా

భరతునకు చేయిస్తి  
పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె 
పదివేల వరహాలు రామచంద్రా

శత్రుఘ్నునకు  చేయిస్తి  
మొలతాడు రామచంద్రా
ఆ మొలతాడునకు పట్టె 
మొహరీలు పదివేలు రామచంద్రా

లక్ష్మణునకు చేయిస్తి 
ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె 
పదివేల వరహాలు రామచంద్రా

సీతమ్మకు చేయిస్తి 
చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె 
పదివేల మొహరీలు రామచంద్రా

కలికి తురాయి నీకు 
పొలుపుగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు  
ఎవరబ్బ సొమ్మని రామచంద్రా

మీ తండ్రి దశరథ 
మహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీ మామ జనక మహరాజు 
పంపెనా రామచంద్రా

అబ్బా తిట్టితినని 
ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక 
అబ్బా  తిట్టితినయ్య రామచంద్రా

భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని  
ఏలుము రామచంద్రా

ఇక్ష్వాకు కులతిలక 
యికనైన పలుకవె రామచంద్రా
నన్ను రక్షింపకున్నను 
రక్షకులెవరయ్య  రామచంద్రా
 

18, జులై 2016, సోమవారం

చిదంబరేశ్వర స్తోత్రం



చిదంబరేశ్వర స్తోత్రం



కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి

వాచామతీతం ఫణి భూషణాంగం
గణేశతాతం ధనస్య మిత్రం
కందర్పనాశం కమలోత్పలాక్షం
చిదంబరేశం హృది భావయామి

రామేశవంద్యం రజతాద్రినాథం
శ్రీ వామదేవం భవ దుఃఖనాశం
రక్షాకరం రాక్షస పీడితానం
చిదంబరేశం హృది భావయామి

దేవాదిదేవం జగదేకనాథం
దేవేశ వంద్యం శశిగంధ చూడం
గౌరీసమేతం కృత విఘ్నదక్షం
చిదంబరేశం హృది భావయామి

వేదాంతవేద్యం సురవైరి విఘ్నం
శుభప్రదం భక్తి మదంతరాణం
కాలాంతకం శ్రీ కరుణా కటాక్షం
చిదంబరేశం హృది భావయామి

హేమాద్రి చాపం త్రిగుణాత్మభావం
గుహాత్మజం వ్యాఘ్ర పురీశమాధ్యం
శ్మశాన వాసం వృషవాహనాదం
చిదంబరేశం హృది భావయామి

ఆద్యంత శూన్యం త్రిపురారి మీశం
నందీశ ముఖ్య స్తుతి వైభవాద్యమ్
సమస్త దేవై పరిపూజితాంఘ్రిం
చిదంబరేశం హృది భావయామి

తమేవ భాంతం అనుభూతి సర్వం
అనేకరూపం పరమార్థమేకం
పినాకపాణిం భవనాశ హేతుం
చిదంబరేశం హృది భావయామి

విశ్వేశ్వరం నిత్యమనన్తమాద్యం
త్రిలోచనం చంద్రకళావతంసం
పతిం పశూనాం హృది సన్నివిష్టం
చిదంబరేశం హృది భావయామి

విశ్వాధికం విష్ణుముఖైరుపశ్యం
త్రిలోచనం పంచ ముఖం ప్రసన్నం
ఉమాపతిం పాపహారం ప్రశాంతం
చిదంబరేశం హృది భావయమి

కర్పూర గాత్రం కమనీయ నేత్రం
కంసారి మిత్రం కమలేందు వక్త్రం
కందర్ప గాత్రం కమలేశ మిత్రం
చిదంబరేశం హృది భావయామి

విశాలనేత్రం పరిపూర్ణగాత్రం
గౌరి కళత్రం హరిదంబరేశం
కుబేరమిత్రం జగతాపవిత్రం
చిదంబరేశం హృది భావయామి

కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం
కాంతా సమాక్రాంత నిజార్థభావం
కపర్థినాం కామరిపుం పురారిం
చిదంబరేశం హృది భావయామి

కల్పాంత కాలాహిత చండ నృత్తం
సమస్త వేదాంత వాచో నిగూఢం
ఆయుగ్మ నేత్రం గిరిజా సహాయం
చిదంబరేశం హృది భావయామి

దిగంబరం శంఖ శీతాల్పహాసం
కాపాలినం శూలినం అప్రమేయం
నాగాత్మజా వక్త్ర పయోజ సూర్యం
చిదంబరేశం హృది భావయామి

సదాశివం సత్పురుషైరనేకై
సదార్చితం సమశిరస్సు గీతం
వైయ్యాగ్ర చర్మంబర ముగ్రమీశం
చిదంబరేశం హృది భావయామి

ఫలశ్రుతి:
చిదంబరస్యాస్తవం పఠేత్య
ప్రదోష కాలేషు పుమాన్చ ధన్య
భోగాన్ అశేషం అనుభూయ భూయ
సాయుజ్యమాప్యేతి చిదంబరస్య



17, జులై 2016, ఆదివారం

తోటకాష్టకం


శ్రీ ఆది శంకరాచార్యుని శిష్యులలో ఒకరైన ఆనందగిరి (తోటకాచార్యులు) 
ఆది శంకరుల నుద్దేశించి చెప్పిన అష్టకం. 


తోటకాష్టకం



విదితాఖిల శాస్త్ర సుధా జలధే
మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం
భవ శంకర దేశిక మే శరణమ్

కరుణావరుణాలయ పాలయ మాం
భవసాగర దుఃఖ విదూనహృదమ్
రచయాఖిల దర్శన తత్త్వవిదం
భవ శంకర దేశిక మే శరణమ్

భవతా జనతా సుహితా భవితా
నిజబోధ విచారణ చారుమతే
కలయేశ్వర జీవవివేకవిదం
భవ శంకర దేశిక మే శరణమ్

భవ ఏవ భవానితి మే నితరాం
సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహ మహాజలధిం
భవ శంకర దేశిక మే శరణం

సుకృతే ధికృతే బహుధా భవతో
భవితా సమదర్శన లాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం
భవ శంకర దేశిక మే శరణమ్

జగతీ మవితుం కలితా కృతయో
విచరంతి మహామహ సశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో
భవ శంకర దేశిక మే శరణమ్

గురుపుంగవ పుంగవకేతన తే
సమతామయతాం నహి కోపి సుధీః
శరణాగత వత్సల తత్త్వనిధే
భవ శంకర దేశిక మే శరణమ్

విదితా న మయా విశదైకకలా
న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం
భవ శంకర దేశిక మే శరణమ్



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)