లాలనుచు నూచేరు లలన లిరుగడలా
లాలనుచు నూచేరు లలన లిరుగడలా
బాల గండవర గోపాల నిను చాల
లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవర గోపాల నిను చాల
లాలి.. లాలి.. లాలీ.. లాలీ
ఉదుటుగుబ్బల సరములుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ
లాలి.. లాలి.. లాలీ.. లాలీ
మలయమారుత గతులు మాటికి జెలంగ
పలుకు గపురపుతావి పై పై మెలంగ
బలు గానలహరి యింపుల రాల్గరంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగ
లాలి.. లాలి.. లాలీ.. లాలీ
లలనా జనాపాంగ లలితసుమచాప
జలజలోచన దేవ సద్గుణకలాప
తలపు లోపల మెలగు తత్త్ వప్రదీప
భళిర గండవరేశ పరమాత్మరూప
లాలి.. లాలి.. లాలీ.. లాలీ
లాలనుచు నూచేరు లలన లిరుగడలా
బాల గండవర గోపాల నిను చాల
లాలనుచు నూచేరు లలన లిరుగడల
బాల గండవర గోపాల నిను చాల
లాలి.. లాలి.. లాలీ.. లాలీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి