Keblinger

Keblinger

31, ఆగస్టు 2015, సోమవారం

వినరో భాగ్యము విష్ణు కధ



వినరో భాగ్యము విష్ణు కధ


వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ

వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ

చేరి యశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియునితడు
చేరి యశోదకు శిశువితడు

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము

ఏమని పొగడుదమే ఇక నిను
ఆమని సొబగుల అలమేల్మంగా
ఏమని పొగడుదమే

వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందమా వేంకటగిరి వేంకటేశ్వరుని
వేంకటగిరి వేంకటేశ్వరుని

ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్మంగ .. వాడు అలమేల్మంగ 
శ్రీవెంకటాద్రి నాధుడే

వేడుకొందామా వేడుకొందామా
వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా .. వేడుకొందామా .. వేడుకొందామా

ఏడు కొండల వాడా 
వెంకటరమణ గోవిందా గోవిందా
ఏడు కొండల వాడా 
వెంకటరమణ గోవిందా గోవిందా

ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి
ఇందరికి అభయంబులిచ్చు చేయి


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - అన్నమయ్య 
గానం - S.P..బాలు,శ్రీలేఖ పార్థసారధి, M.M.కీరవాణి

30, ఆగస్టు 2015, ఆదివారం

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే



బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే



హరినామమే కడు అనందకరము
మరుగవో మరుగవో మరుంగవో మనసా
హరినామమే కడు అనందకరము
రంగా.. రంగా..


రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగారలె తరచాయ శ్రీరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ
నీ సింగారలె తరచాయ శ్రీరంగనాధ

రంగనాధా శ్రీరంగనాధ .. రంగనాధా శ్రీరంగనాధ

వేదములు నుతింపగ 
వేడుకలు దైవారగ ఆదరించి
దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడూ .. మోహన నారసింహుడూ

కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ
తెట్టెలాయె మహిమలే 
తిరుమల కొండ .. తిరుమల కొండ

కట్టెదురా వైకుంఠము కాణాచైన కొండ
తెట్టెలాయె మహిమలే 
తిరుమల కొండ .. తిరుమల కొండ
తిరుమల కొండ.. తిరుమల కొండ

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే
తంనానా భళా తంనానా భళా

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అండనే బంటు నిద్ర అదియూ నొకటే

మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుండేటి సరిభూమి యొకటే

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
పరబ్రహ్మమొక్కటే
అడవి ఏనుగుమీద కాయు యెండోకటే
పుడమి శునకము మీద పొలయు యుండొకటే 

కడు పుణ్యులను పాపకర్ములను సరిగావ 
జడియు శ్రీ వేంకటేశ్వరు నామయొకటే
కడు పుణ్యులను పాపకర్ములను సరిగా
జడియు శ్రీ వేంకటేశ్వరు నామయొకటే

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
పరబ్రహ్మమొక్కటే .. పరబ్రహ్మమొక్కటే

తందనానా ఆహి తందనానా పురే 
తందనానా భళా తందనానా 
భళా తందనానా భళా తందనానా 
పరబ్రహ్మమొక్కటే .. భళా తందనానా
పరబ్రహ్మమొక్కటే .. భళా తందనానా


చిత్రం - అన్నమయ్య (1998)
సంగీతం - M.M.కీరవాణి
రచన  - అన్నమయ్య
గానం - S.P. బాలు

29, ఆగస్టు 2015, శనివారం

విన్నపాలు వినవలె వింతవింతలూ



విన్నపాలు వినవలె వింతవింతలూ




విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

విన్నపాలు వినవలె వింతవింతలూలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

విన్నపాలు వినవలె వింతవింతలూ..

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని.. కంటీ..

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు

పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు

విభు పేరు గుచ్చ సిగ్గువడీ
పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల

పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల

ఉయ్యాల .. ఉయ్యాల
ఉయ్యాల .. ఉయ్యాల
ఉయ్యాల .. ఉయ్యాల
ఉయ్యాల .. ఉయ్యాల



చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P.బాలు, రేణుక, శ్రీలేఖ పార్ధసారధి

28, ఆగస్టు 2015, శుక్రవారం

శ్రావణమాసం వరలక్ష్మీ పూజ



 శ్రావణమాసం వరలక్ష్మీ పూజ


ఈ పూజ ప్రత్యేకంగా కళాత్మకంగా చేస్తారు.కొబ్బరికాయ పీచు బాగా తీసి పసుపు, బియ్యం పిండి కలిపి బొమ్మను చేస్తారు. ముక్కు, కళ్ళు, చెవులు, నోరు అందంగా అమరుస్తారు. నగలు, పువ్వులు, జడ, కొత్తచీర, రవికె అలంకరిస్తారు. బిందె మీద మర చెంబు ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి చక్కగా కూర్చున్నట్లుగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇందులో కళ ఇమిడి ఉంది. ఆనందం, భక్తి ఉన్నాయి. కొంతమంది నగలు అలంకరించిన వెండి ముఖం ఉంచుతారు. దీన్ని పసుపు రాసిన కొబ్బరికాయకు అమర్చి చీర, జాకెట్‌ కట్టి అలంకరించి పూజిస్తారు. మరి కొందరు చెంబులో నీళ్ళు, పసుపు, మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి, దానిపై కొబ్బరికాయ పెట్టి, రవిక మడిచిపెట్టి నగలు, పూవులతో అలంకరిస్తారు. ఏ తరహాలో చేసినా భక్తి ప్రధానం. ఇప్పుడు రెడీమేడ్ గా చక్కగా చీరకట్టి తయారుచేసిన అమ్మవారి విగ్రహాలు దొరుకుతున్నాయి.

 ఆయా ప్రాంతాల ఆనవాయితీని బట్టి ఈ పూజ చేస్తారు. ఈ పూజకి కొత్త పెళ్ళికూతురైతే తొమ్మిది పిండివంటలు, మామూలు వారైతే ఐదు లేక మూడు పిండి వంటలు చేస్తారు. బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం తప్పనిసరిగా వండి నైవేద్యం పెట్టాలి. బియ్యం, శనగపప్పు, మినపప్పు, మైదా పిండి వాడి ఈ వంటకాలు చేస్తారు. బియ్యంతో చక్రపొంగలి, పరమాన్నం, దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర, వెజిటబుల్‌ రైస్‌, కొబ్బరి అన్నం, పులగము, పెరుగన్నం అనే తొమ్మిది రకాలు చేయవచ్చు. బూరెలు, గారెలు, ఉండ్రాళ్ళు, ప్రసాదం, కాజాలు, పూరీలు, అట్లు, అప్పాలు, బొబ్బట్లు ఇలాంటివెన్నో వీలును బట్టి చేసుకోవచ్చు. తీపి, కారం వంటకాలతో నివేదిన చేయాలి. ఐదు రకాల పువ్వులు, పండ్లు కూడా దేవికి పెడుతారు. పాలవెల్లి కూడా కడుతారు. 

ఈ సీజన్‌లో మొగలిపువ్వులు ఎక్కువగా దొరుకుతాయి. చామంతి, మల్లె, మరువం, దవనం కూడా బాగా లభిస్తాయి. మందారం, గన్నేరు, కనకాంబరం, బంతి, నాగమల్లి, నందివర్ధనం చేర్చి పూజ చేస్తారు. పసుపు రాసిన పచ్చదారం తొమ్మిది పేటలు వేసి దానిలో తొమ్మిది ముడులు వేసి పువ్వులు కట్టి చేతికి కట్టుకుంటారు. తోరానికి తగిన మంత్రం ఉంటుంది. ఈ తోరం చేతికి ఉంటే తొమ్మిది గండాల నుంచి రక్షణ ఇస్తుందని చారుమతి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఆనందంగా ప్రదక్షిణం చేస్తారు. మొదటి ప్రదక్షిణానికి గజ్జెలు, రెండో దానికి ఒంటి నిండా నగలు, మూడో దానికి ఇల్లు భవంతిగా మారిందని కథ చెబుతారు. మన కోరికలు తీరుస్తుందని దీనికి అర్థం. 

అమ్మవారిని వాగ్గేయకారులు కీర్తనలతో కీర్తించారు. ‘శ్రీ వరలక్ష్మి నమోస్తుభ్యం, వసుప్రదీ, శ్రీసార సపదీ, రసపదీ, సపదీ....’ అంటూ రాసిన కీర్తన, ‘శ్రావణ బహుళ శుక్రవారే చారుమతి...’ అంటూ రాసిన కీర్తన చారుమతి కథను స్ఫురింపజేస్తాయి. ఇక్కడ పాలవెల్లి ప్రాముఖ్యం, పూలు, పండ్ల ప్రాధాన్యం తెలుస్తాయి. అన్నమయ్య కీర్తనల్లో అలివేలు మంగను వర్ణిస్తూ ఎన్నో కీర్తనలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ‘కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేల్మంగ ...’ అని పాడుతూ ఆవిడ స్నానం చేసే విధానాన్ని, పన్నీరు తట్టు, పునుగుతో ఆమె శరీరాన్ని అలంకరించిన రీతిని ఎంతో చక్కగా వర్ణించారు. అదే విధంగా మంగళహారతిలో, క్షీరాబ్దికన్యకునీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం అని అమ్మవారిని వర్ణిస్తూ కీర్తించారు. నీరాజనమిచ్చే టప్పుడు ఈ పాట తప్పనిసరిగా పాడుతారు. 

పగటు  శ్రీవేంకటేశు పట్టపురాణియైన నెగడు సతి కళలకు నీరాజనం, జగతి అలమేల్మంగ.... అంటూ నీరాజనం కీర్తన పాడుతారు. ఇలా అమ్మవారిని పూజిస్తూ, వ్రతం చేస్తారు. సాయంత్రం వేళ పేరంటం చేసి ముత్తయిదువులకు పళ్ళు, పూలు, తాంబూలం పంచిపెడుతారు. ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం ఎదుటి స్ర్తీని వరలక్ష్మిగా పూజించి తాంబూలం, పసుపు, బొట్టు, గంధం ఇవ్వడం. పూజ అనంతరం కుడుములు లేదా బూరెలు 9 లేదా 11 వాయినంగా ఇవ్వాలి. వారికి తోరం కూడా ఇచ్చి కట్టించుకోవాలి. వారికి కట్టాలి. వీలుంటే పూజ అనంతరం ఒక స్ర్తీకి భోజనం పెట్టి రవికల గుడ్డ ఇస్తారు. స్తోమతను బట్టి చీర కూడా ఇవ్వవచ్చు. వ్రతాల్లో పుణ్యం, పరమార్థం ఉంటాయి. తోటి మనిషిని గౌరవించడం ద్వారా పూజలు సఫలం అవుతాయి. కొత్త పెళ్ళికూతురు భర్తతో కలసి ఈ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.



లక్ష్మీ రావే మా ఇంటికి .. వరలక్ష్మీ రావే మాఇంటికి


వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు



లక్ష్మీ రావే మా ఇంటికి  ..




లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికీ

లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న
లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి

లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి

కుంకుమ పచ్చ కస్తూరి కోరిక తోనూ గోరోజనము
కుంకుమ పచ్చ కస్తూరి కోరిక తోనూ గోరోజనము
జాజి పూవు జలజ లోచని ముదము తోడ అర్పింతును
జాజి పూవు జలజ లోచని ముదము తోడ అర్పింతును

చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము
చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము

మాతా నీకూ ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ
మాతా నీకూ ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ

లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి

పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం
పంచ బిల్వములు పూర్ణకలశములు
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం
పంచ బిల్వములు పూర్ణకలశములు

మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మ
మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మ

 లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి

బొండుమల్లె మొగలిపూలు 
దండిగా చామంతి పూలు మేలైనా పారిజాతము
బొండుమల్లె మొగలిపూలు 
దండిగా చామంతి పూలు మేలైనా పారిజాతము

మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మ
మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మ

లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి

అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలిపూల జడనే అల్లి జడకుచ్చులను కట్టేనమ్మ
అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలిపూల జడనే అల్లి జడకుచ్చులను కట్టేనమ్మ

మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కనిపూజ
మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కనిపూజ

లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి

అందముగా  అడవిపండ్లు కదళీపండ్లు రేగుపండ్లు 
మేలైనా దానిమ్మపండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు
అందముగా అడవిపండ్లు కదళీపండ్లు రేగుపండ్లు 
మేలైనా దానిమ్మపండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు

పండు వెన్నెలతో నీకు పద్మశ్రీ నేనే పూజింప
పండు వెన్నెలతో నీకు పద్మశ్రీ నేనే పూజింప          

లక్ష్మీ రావే మా ఇంటికి  వరలక్ష్మీ రావే మాఇంటికి     
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికి
క్షీరాబ్ధి పుత్రీ వరలక్ష్మీ రావే మాఇంటికీ 
క్షీరాబ్ధి పుత్రీ  రావే మాఇంటికీ

రావే మాఇంటికీ .. రావే మాఇంటికీ .. రావే మాఇంటికీ




27, ఆగస్టు 2015, గురువారం

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా



పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా




పురుషోత్తమా .. పురుషోత్తమా .. పురుషోత్తమా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
   
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి
పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా

గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వేంకటేశాయ .. ఓం నమో వేంకటేశాయ

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా

బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా

పురుషోత్తమా .. పురుషోత్తమా .. పురుషోత్తమా


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P.బాలు

26, ఆగస్టు 2015, బుధవారం

తెలుగు పదానికి జన్మదినం



తెలుగు పదానికి జన్మదినం



ఓం ఓం.....

తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై
వెలసిన కలియుగ విష్ణు పదం

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే
హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి
నాదాశిస్సులు పొందినదై

శివలోకమ్మున చిద్విలాసమున
డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల
చేబంతిగ ఎగసి

నీరద మండల నారద తుంబుర
మహతి గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో
తపః ఫలమ్ముగ తళుకుమని

తల్లి తనముకై తల్లడిల్లు
ఆ లక్క మాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానంద కారకము

అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై
అంధ్ర సాహితి అమర కోశమై

అవతరించెను అన్నమయ్య
అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య
అసతోమా సద్గమయ

పాపడుగా నట్టింట పాకుతు
భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక
అరముద్దలనే ముట్టడయా

తెలుగు భారతికి వెలుగు హారతై
ఎదలయలో పద కవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య

తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - కీరవాణి
గీతరచన - వేటూరి
గానం - S.P.బాలు, సుజాత, రేణుక

25, ఆగస్టు 2015, మంగళవారం

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి



కలగంటి కలగంటి 



కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు
తిరు వేంకటాద్రీశుడంటి

కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు
తిరు వేంకటాద్రీశుడంటి

ఇప్పుడిటు కలగంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగగంటి

చతురాశ్యు పొడగంటి
చతురాశ్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి

అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచాలదిపుని చూడగగంటి

హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతటా మేలుకంటి

కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు
తిరు వేంకటాద్రీశుడంటి
   
ఇప్పుడిటు కలగంటి
ఇప్పుడిటు కలగంటి


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - బాలు

24, ఆగస్టు 2015, సోమవారం

అదివో అల్లదివో శ్రీహరి వాసము



అదివో అల్లదివో శ్రీహరి వాసము



ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
   
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
  
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము

ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవింద

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకూ
   
వేంకటరమణా సంకట హరణా
వేంకటరమణా సంకట హరణా
నారాయణ .. నారాయణ

అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదెచూడుడూ .. అదెమ్రొక్కుడూ .. ఆనంద మయము
అదెచూడుడదెమ్రోక్కుడానంద మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము

వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద
ఆపదమ్రొక్కులవాడా అనాధరక్షకా గోవిందా గోవింద

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో

వేంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపద రూప మదివో..అదివో
పావనములకెల్ల పావన మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీ హరివాసమూ శ్రీహరివాసమూ శ్రీహరివాసమూ

వేంకటేశా నమో శ్రీనివాసా నమో
వేంకటేశా నమో శ్రీనివాసా నమో

ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవింద
అదివో అదివో....
ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవింద
అదివో అదివో....


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - M.M.కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P.బాలు

23, ఆగస్టు 2015, ఆదివారం

అంతర్యామి అలసితి సొలసితి




అంతర్యామి అలసితి సొలసితి 


అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని
అంతర్యామి అలసితి సొలసితీ

కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక

భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
నేరుపున బోవు నీవు వద్దనక

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ  ..  అంతర్యామీ

మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక

ఎదుటనే శ్రీవేంకటేశ్వర
వేంకటేశా .. శ్రీనివాసా  ప్రభో
ఎదుటనే శ్రీవేంకటేశ్వర నీవదె
అదనగాచితివి అట్టిట్టనక

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితిని

అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అంతర్యామి
అంతర్యామి అలసితి


చిత్రం - అన్నమయ్య (1997)
సంగీతం - M.M. కీరవాణి
గీతరచన - అన్నమయ్య
గానం - S.P. బాలు

22, ఆగస్టు 2015, శనివారం

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా




ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా



ఎట్లా  నిన్నెత్తుకొందునమ్మా
మహలక్ష్మీ తల్లీ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

ఎట్లా నిన్నెత్తుకొందును
ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లీ

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా
మహలక్ష్మీ తల్లీ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

పసిబాలవైతే ఎత్తుకుందు మహలక్ష్మీ తల్లి
పసిడి బుగ్గల పాలవెల్లి
పసిబాలవైతే ఎత్తుకుందు మహలక్ష్మీ తల్లి
పసిడి బుగ్గల పాలవెల్లి

పువ్వులు పండ్లు తోరణములతో
పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి
ఘల్లుఘల్లుమని నడిచే తల్లి 

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా
మహలక్ష్మీ తల్లీ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

ఎట్లా నిన్నెత్తుకొందును
ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లీ

ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా
మహలక్ష్మీ తల్లీ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా

కలలన్నీ కన్నుల కరిగే వేళా
ఏ లోకాలో రమ్మని పిలిచే వేళా 
తల్లివి నీవై పాపను నేనై నీ వొడిలోనే నిద్దురపోవ 
ఈ జన్మకు ఆ వరము చాలునమ్మా 
 
ఎట్లా నిన్నెత్తుకొందును
ఆట్లాడే బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లీ 

 ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా
మహలక్ష్మీ తల్లీ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా


21, ఆగస్టు 2015, శుక్రవారం

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే



సర్వమంగళ మాంగళ్యే 



సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే 

 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే  

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే 


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)