Keblinger

Keblinger

28, ఆగస్టు 2015, శుక్రవారం

శ్రావణమాసం వరలక్ష్మీ పూజ శ్రావణమాసం వరలక్ష్మీ పూజ


ఈ పూజ ప్రత్యేకంగా కళాత్మకంగా చేస్తారు.కొబ్బరికాయ పీచు బాగా తీసి పసుపు, బియ్యం పిండి కలిపి బొమ్మను చేస్తారు. ముక్కు, కళ్ళు, చెవులు, నోరు అందంగా అమరుస్తారు. నగలు, పువ్వులు, జడ, కొత్తచీర, రవికె అలంకరిస్తారు. బిందె మీద మర చెంబు ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి చక్కగా కూర్చున్నట్లుగా అమ్మవారిని అలంకరిస్తారు. ఇందులో కళ ఇమిడి ఉంది. ఆనందం, భక్తి ఉన్నాయి. కొంతమంది నగలు అలంకరించిన వెండి ముఖం ఉంచుతారు. దీన్ని పసుపు రాసిన కొబ్బరికాయకు అమర్చి చీర, జాకెట్‌ కట్టి అలంకరించి పూజిస్తారు. మరి కొందరు చెంబులో నీళ్ళు, పసుపు, మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి, దానిపై కొబ్బరికాయ పెట్టి, రవిక మడిచిపెట్టి నగలు, పూవులతో అలంకరిస్తారు. ఏ తరహాలో చేసినా భక్తి ప్రధానం. ఇప్పుడు రెడీమేడ్ గా చక్కగా చీరకట్టి తయారుచేసిన అమ్మవారి విగ్రహాలు దొరుకుతున్నాయి.

 ఆయా ప్రాంతాల ఆనవాయితీని బట్టి ఈ పూజ చేస్తారు. ఈ పూజకి కొత్త పెళ్ళికూతురైతే తొమ్మిది పిండివంటలు, మామూలు వారైతే ఐదు లేక మూడు పిండి వంటలు చేస్తారు. బియ్యం, పాలు, బెల్లంతో పరమాన్నం తప్పనిసరిగా వండి నైవేద్యం పెట్టాలి. బియ్యం, శనగపప్పు, మినపప్పు, మైదా పిండి వాడి ఈ వంటకాలు చేస్తారు. బియ్యంతో చక్రపొంగలి, పరమాన్నం, దద్దోజనం, కట్టు పొంగలి, పులిహోర, వెజిటబుల్‌ రైస్‌, కొబ్బరి అన్నం, పులగము, పెరుగన్నం అనే తొమ్మిది రకాలు చేయవచ్చు. బూరెలు, గారెలు, ఉండ్రాళ్ళు, ప్రసాదం, కాజాలు, పూరీలు, అట్లు, అప్పాలు, బొబ్బట్లు ఇలాంటివెన్నో వీలును బట్టి చేసుకోవచ్చు. తీపి, కారం వంటకాలతో నివేదిన చేయాలి. ఐదు రకాల పువ్వులు, పండ్లు కూడా దేవికి పెడుతారు. పాలవెల్లి కూడా కడుతారు. 

ఈ సీజన్‌లో మొగలిపువ్వులు ఎక్కువగా దొరుకుతాయి. చామంతి, మల్లె, మరువం, దవనం కూడా బాగా లభిస్తాయి. మందారం, గన్నేరు, కనకాంబరం, బంతి, నాగమల్లి, నందివర్ధనం చేర్చి పూజ చేస్తారు. పసుపు రాసిన పచ్చదారం తొమ్మిది పేటలు వేసి దానిలో తొమ్మిది ముడులు వేసి పువ్వులు కట్టి చేతికి కట్టుకుంటారు. తోరానికి తగిన మంత్రం ఉంటుంది. ఈ తోరం చేతికి ఉంటే తొమ్మిది గండాల నుంచి రక్షణ ఇస్తుందని చారుమతి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఆనందంగా ప్రదక్షిణం చేస్తారు. మొదటి ప్రదక్షిణానికి గజ్జెలు, రెండో దానికి ఒంటి నిండా నగలు, మూడో దానికి ఇల్లు భవంతిగా మారిందని కథ చెబుతారు. మన కోరికలు తీరుస్తుందని దీనికి అర్థం. 

అమ్మవారిని వాగ్గేయకారులు కీర్తనలతో కీర్తించారు. ‘శ్రీ వరలక్ష్మి నమోస్తుభ్యం, వసుప్రదీ, శ్రీసార సపదీ, రసపదీ, సపదీ....’ అంటూ రాసిన కీర్తన, ‘శ్రావణ బహుళ శుక్రవారే చారుమతి...’ అంటూ రాసిన కీర్తన చారుమతి కథను స్ఫురింపజేస్తాయి. ఇక్కడ పాలవెల్లి ప్రాముఖ్యం, పూలు, పండ్ల ప్రాధాన్యం తెలుస్తాయి. అన్నమయ్య కీర్తనల్లో అలివేలు మంగను వర్ణిస్తూ ఎన్నో కీర్తనలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ‘కంటి శుక్రవారము గడియలేడింట, కంటి అలమేల్మంగ ...’ అని పాడుతూ ఆవిడ స్నానం చేసే విధానాన్ని, పన్నీరు తట్టు, పునుగుతో ఆమె శరీరాన్ని అలంకరించిన రీతిని ఎంతో చక్కగా వర్ణించారు. అదే విధంగా మంగళహారతిలో, క్షీరాబ్దికన్యకునీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం అని అమ్మవారిని వర్ణిస్తూ కీర్తించారు. నీరాజనమిచ్చే టప్పుడు ఈ పాట తప్పనిసరిగా పాడుతారు. 

పగటు  శ్రీవేంకటేశు పట్టపురాణియైన నెగడు సతి కళలకు నీరాజనం, జగతి అలమేల్మంగ.... అంటూ నీరాజనం కీర్తన పాడుతారు. ఇలా అమ్మవారిని పూజిస్తూ, వ్రతం చేస్తారు. సాయంత్రం వేళ పేరంటం చేసి ముత్తయిదువులకు పళ్ళు, పూలు, తాంబూలం పంచిపెడుతారు. ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం ఎదుటి స్ర్తీని వరలక్ష్మిగా పూజించి తాంబూలం, పసుపు, బొట్టు, గంధం ఇవ్వడం. పూజ అనంతరం కుడుములు లేదా బూరెలు 9 లేదా 11 వాయినంగా ఇవ్వాలి. వారికి తోరం కూడా ఇచ్చి కట్టించుకోవాలి. వారికి కట్టాలి. వీలుంటే పూజ అనంతరం ఒక స్ర్తీకి భోజనం పెట్టి రవికల గుడ్డ ఇస్తారు. స్తోమతను బట్టి చీర కూడా ఇవ్వవచ్చు. వ్రతాల్లో పుణ్యం, పరమార్థం ఉంటాయి. తోటి మనిషిని గౌరవించడం ద్వారా పూజలు సఫలం అవుతాయి. కొత్త పెళ్ళికూతురు భర్తతో కలసి ఈ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)