Keblinger

Keblinger

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు




జగన్మోహనాకారా.. 



జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటునా సోదంబు యిది నా వెలితో నీ.. వెలితో
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా

ఎన్ని మారులు సేవించినా
కన్నులూ తనియవు
విన్న నీ కథామృతమున
వీనులూ తనియవు

సన్నిధిని మిమ్ము నుతియించి
సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు యిది నా వెలితో...
విన్న కన్నది కాదు యిది నా వెలితో నీ.. వెలితో

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా

కడగి నీ ప్రసాదమేకొని
కాయమూ తనియదు
బడి ప్రదక్షిణములు చేసి
పాదములు యివి తనియవు

నుడివి సాష్టాంగంబు చేసి
నుదురునూ తనియదు
వెడగుదనమిది కలిగే నిది నా వెలితో ...
వెడగుదనమిది కలిగే నిది నా వెలితో నీ.. వెలితో

జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా

చెలగి నిను నే పూజించి
చేతులూ తనియవు
చెలువు సింగారంబు తలచి
చిత్తమూ తనియదు

అలరి శ్రీవేంకటగిరీశ్వర
ఆత్మ నను మోహింప జేసితి
వెలయనిన్నియుదేరె మును నీ వెలితో
వెలయనిన్నియుదేరె మును నీ వెలితో నా వెలితో


22, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఇతనికంటే మరిదైవము కానము




ఇతనికంటే మరిదైవము కానము



ఇతనికంటే మరి దైవము కానము
యెక్కడ వెదకిన ఇతడే
ఇతనికంటే మరిదైవము కానము
యెక్కడ వెదకిన ఇతడే

అతిశయమగు మహిమలతో
వెలసెను అన్నిటికాధారముతానె
ఇతనికంటే మరి దైవము కానము
యెక్కడ వెదకిన ఇతడే

మదిజలధులనొకదైవము వెదకిన
మత్స్యావతారంబితడు
అదివో పాతాళమందు వెదకితే
ఆదికూర్మ మీ విష్ణుడు

పొదిగొని యడవుల వెదకి చూచితే
భూవరాహమని కంటిమి
చెదరక కొండల గుహల వెదకితే
శ్రీనరసింహంబున్నాడు

తెలిసి భూనభోంతరమున వెదకిన
త్రివిక్రమాకృతి నిలిచినది
పలువీరులలో వెదకిచూచితే
పరశురాముడొకడైనాడూ

తలపున శివుడునుపార్వతి వెదకిన
తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన
కృష్ణుడు రాముడునైనారు

పొంచి అసురకాంతలలో వెదకిన
బుధ్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన
మీదటి కల్క్యావతారము

అంచెల జీవుల లోపల వెదకిన
అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన
యీతడే శ్రీ వేంకటవిభుడు

ఇతనికంటే మరిదైవము కానము
యెక్కడ వెదకిన ఇతడే
ఇతనికంటే మరిదైవము కానము
యెక్కడ వెదకిన ఇతడే


4, ఫిబ్రవరి 2015, బుధవారం

ఓం శ్రీ మాత్రే నమః







  1. అన్నపూర్ణాష్టకం
  2.  కనకధారా స్తోత్రం
  3.   దేవీ కవచం
  4.  చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి
  5.  అయిగిరినందిని నందితమేదిని
  6.  శ్రీ దుర్గా సూక్తం  
  7.  అరుణాం కరుణా తరంగితాక్షీం 
  8.  శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే
  9.  సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం 
  10.  శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామ స్తోత్రం
  11.  శ్రీ బాలా త్రిపుర సుందరి స్తోత్రం
  12.  అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
  13.   శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం
  14.    శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
  15.  శ్రీ సూక్తం
  16.  దేవీ కవచం
  17. అష్టలక్ష్మీ స్తోత్రం 
  18.   మహాలక్ష్మి అష్టకం
  19. శ్యామలా దండకం
  20. లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
  21.  వాణీ మాంపాహీ .. గీర్వాణీ మాంపాహీ
  22.  శ్రీ పంచమి -- మహా సరస్వతీ స్తోత్రం
  23.   పాడ్యమి - జై శైలపుత్రీ జగదంబా
  24.  విదియ - జై బ్రహ్మచారిణి జగదంబా
  25.   తదియ - జై చంద్రఘంటా జగదంబా
  26. చవితి - జై కూష్మాండా జగదంబా 
  27. పంచమి - జై స్కంధమాతా జగదంబా 
  28.  షష్టి - జై కాత్యాయని జగదంబా
  29. సప్తమి -జై కాళరాత్రీ జగదంబా
  30.  అష్టమి - జై మహాగౌరీ జగదంబా
  31. నవమి - జై సిద్ధిధాత్రీ జగదంబా
  32.  శ్రీ మాతా రాజరాజేశ్వరి
  33.  సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

  34.  జననీ శివకామినీ జయ శుభకారిణి
  35.  శివానీ .... భవానీ ... శర్వాణీ.
  36.   శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ
  37.  చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా 
  38. మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
  39. మహాచండి
  40.  లక్ష్మీ రావే మా ఇంటికి 
  41.    అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
  42. శ్రీ లలిత శివ జ్యోతి సర్వ కామద
  43. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి
  44.  శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
  45. హిమగిరి తనయే హేమలతే
  46.  




సకల దేవతా స్తోత్రములు











Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)