జగన్మోహనాకారా..
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
వెగటునా సోదంబు యిది నా వెలితో నీ.. వెలితో
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా
ఎన్ని మారులు సేవించినా
కన్నులూ తనియవు
విన్న నీ కథామృతమున
వీనులూ తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి
సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదు యిది నా వెలితో...
విన్న కన్నది కాదు యిది నా వెలితో నీ.. వెలితో
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా
కడగి నీ ప్రసాదమేకొని
కాయమూ తనియదు
బడి ప్రదక్షిణములు చేసి
పాదములు యివి తనియవు
నుడివి సాష్టాంగంబు చేసి
నుదురునూ తనియదు
వెడగుదనమిది కలిగే నిది నా వెలితో ...
వెడగుదనమిది కలిగే నిది నా వెలితో నీ.. వెలితో
జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
జగన్మోహనాకారా .. జగన్మోహనాకారా
చెలగి నిను నే పూజించి
చేతులూ తనియవు
చెలువు సింగారంబు తలచి
చిత్తమూ తనియదు
అలరి శ్రీవేంకటగిరీశ్వర
ఆత్మ నను మోహింప జేసితి
వెలయనిన్నియుదేరె మును నీ వెలితో
వెలయనిన్నియుదేరె మును నీ వెలితో నా వెలితో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి