ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
శ్రీ రఘునందన సీతారమణా
శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను
కన్నది కానుపు రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
క్రూరకర్మములు నేరక జేసితి
నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె
దైవశిఖామణి రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
మురిపెముతో నా స్వామివి నీవని
ముందుగ తెల్పితి రామా
మరవక యిక అభిమానముంచు
నీ మరుగుజొచ్చితిని రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
గురుడవు నామది దైవము నీవని
గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు
క్రూరుడ నైతిని రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
నిండితి వీ వఖిలాండకోటి
బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీ నామము దలచిన
నిత్యానందము రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
వాసవ కమల భవాసురవందిత
వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన
భద్రాద్రీశ్వర రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
వాసవనుత రామదాస పోషక
వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె
దాశరధీ రఘురామా
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
శ్రీ రఘునందన సీతారమణా
శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను
కన్నది కానుపు రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
క్రూరకర్మములు నేరక జేసితి
నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె
దైవశిఖామణి రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
మురిపెముతో నా స్వామివి నీవని
ముందుగ తెల్పితి రామా
మరవక యిక అభిమానముంచు
నీ మరుగుజొచ్చితిని రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
గురుడవు నామది దైవము నీవని
గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు
క్రూరుడ నైతిని రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
నిండితి వీ వఖిలాండకోటి
బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీ నామము దలచిన
నిత్యానందము రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
వాసవ కమల భవాసురవందిత
వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన
భద్రాద్రీశ్వర రామా
ఏతీరుగ నను దయజూచెదవో
ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను
నళినదళేక్షణ రామా
వాసవనుత రామదాస పోషక
వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె
దాశరధీ రఘురామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి