Keblinger

Keblinger

ధనుర్మాసం - తిరుప్పావై పాశురాలు

| శుక్రవారం 16 డిసెంబర్ 2011

ఆండాళ్ లేదా గోదాదేవి ,శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె.
ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
యుక్త వయస్సుకి వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. విష్ణుచిత్తులవారు ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలు అలంకరణగా తీసుకోని వెళ్ళేవారు,
అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తరువాత స్వామివారికి పంపించసాగినది,
రోజు రహస్యం తండ్రి అయిన విష్ణుచిత్తులవారికి తెలిసి, చాలా దుఃఖించి
స్వామివారికి మాలాధారణ కావించరు, దానితో స్వామి మొహం చిన్నబోతుంది,
దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని చాలా బాధపడుతుంటే
స్వామివారు విష్ణుచిత్తులతో అదేమీ లేదనీ, అంతే కాకుండా ఇహ ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన
మాలాధారణే కావాలని ఆదేశిస్తారు, దానితో విష్ణుచిత్తులవారు అలాగే చేస్తారు.

తరువాత గోదా అమ్మవారు, తన తోటి బాలికలతో కలిసి "తిరుప్పావై " వ్రతాచరణ చేస్తారు.
తరువాత స్వామివారి ఆదేశానుసారం గోదాదేవికీ, రంగనాథస్వామి వారికీ వివాహం జరుగుతుంది..
వివాహానంతరం గోదాదేవి చిద్విలాసునిలో లీనమవుతుంది,
అది చూసి విష్ణుచిత్తులవారు దుఃఖితులయితే స్వామి విష్ణుచిత్తులకు జ్ఞానోపదేశంచేసి
మాయ నుండి వెలుపలకి రావడానికి సాయం చేస్తారు.
గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన "తిరుప్పావై" చాలా ప్రసిద్ధమైనది.
దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ, విష్ణువు యొక్క ఆలయంలో రోజుకొక్క పాశురం చొప్పున పఠిస్తారు.

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

Copyright © 2010 ☼ భక్తిప్రపంచం ☼