తిరుప్పావై - పాశురము 30
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్!
వ్రతాచరణమే ఇహపర సౌఖ్యాలకు మూలం
ఓడలు తిరుగాడే మహాసముద్రాన్ని చిలికిన శ్రీ మహావిష్ణువూ,
కేశియను రాక్షసుని సంహరించినవాడూ అయిన శ్రీ గోపాలకృష్ణుని సన్నిధిని జేరి
గోదాదేవి భక్తితో సుతించి కీర్తించింది.
నానారకాలైన ఆభరణాలను అలంకరించుకొన్న చంద్రముఖులైన గోపికలు
వ్రేపల్లెలో పొందిన వరాల వృత్తాంతాన్ని వివరిస్తూ,
శ్రీ గోదాదేవి తిరుప్పావు స్తుతిని చేసింది.
గోదాదేవి భూమండలానికే అలంకారప్రాయమైన శ్రీవిల్లిపుత్తూరుక్షేత్రంలోని విష్ణుచిత్తుడనే
పరమభాగవత్తోముని ముద్దులకూతురు.
మనోహరమైన వికసితతామరపుష్పమాలను ధరించిన
శ్రీ గోదాదేవి ( ఆండాళ్ ) తమిళభాషలో సమర్పించిన తిరుప్పావై అనే ముప్పది పాశురములుగల
పుష్పమాలికను ధనుర్మాసంలో గాని, లేదా ప్రతినిత్యమూ గాని పారాయణ చేసేవారు,
చతుర్భుజుడై పద్మ నేత్రుడై సుందరదరహాసవిందుడై సర్వసంపదలతో
విరాజిల్లుతున్న శ్రీనివాస ప్రభువుల పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్షములకు పాత్రులై,
ఇహపర సౌఖ్యాలు పొందుతారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి