తిరుప్పావై - పాశురము 19
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.
శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పమని దేవేరిని ప్రార్ఠించడం
నాలుగుమూలల్లో దీపపు సెమ్మెలు వెలుగుతుండగా, దంతపుకోళ్ళ మంచమ్మీద ,
సుతిమెత్తని దూదిపరుపుపై, జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకొన్న,
నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా ! నోరు తెరచి ఒక్కమాటైనా మాటాడరాదా !
(శ్రీకృష్ణుడు ఉలుకడు, పలుకడు )
కాటుక పెట్టుకొన్న అందమైన కన్నులుగల నీలాసుందరీ !
ప్రేమాస్పదుడైన నీ పతిని ఎంత పొద్దుపోయినా నిద్రలేపేందుకు నీకు మనసొప్పనేలేదా!
నీ స్వామిని క్షణకాలమైనా నీవు విడిచి పెట్టేదానివిగా కన్పడడంలేదు .
ఇది నీ స్వభావానికి తగని పని. అమ్మా నీలాదేవీ !
స్వామివారితో కూడా మేల్కొని మా నోమును ఫలింపజేయుమమ్మా !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి