తిరుప్పావై - పాశురము 28
క ఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.
గోపికలు తమ భక్తి ప్రపత్తులు వెల్లడించడం
స్వామీ ! మేము పశువులవెంట పోతూ, వాటిని అడవుల్లో మేపుకొంటూ జీవించేవాళ్ళం.
నీవు జన్మించినందువల్ల గోకులం మాహాపుణ్యప్రదమయ్యింది.
అలాంటి గోప్రల్లెలోనే మా భాగ్యవశంచేత మేమూ పుట్టాం. సర్వలక్షణశోభితుడైన గోవిందా !
ఈ గోపల్లెలో నీ తోడి మా సంబంధం విడదీయలేనిది, విడదీయరానిది. .
మేము ఏమీ తెలియని అమాయకులమైన గోపకన్నెలం !
స్వామీ ! నేస్తాలమైన మేము ప్రేమతో అతిచనువుగా నిన్ను ముద్దు పేర్లతో పిలిచినందుకు అలిగిపోవద్దు.
మాపై దయ కలిగి పురుషార్థాలను ప్రసాదించి మా నోమును నెరవేర్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి