తిరుప్పావై - పాశురము 18
ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్.
నీలాసుందరీదేవికి మేలుకొలుపు
మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని
భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా !
ఓ నీలాసుందరీదేవీ ! నిద్ర మేలుకోవమ్మా !
కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ !
నిద్దుర లేచి తలుపు తెరువు ! అంతటా కోళ్ళు కూస్తున్నవి .
గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి.
పూలబంతులను పట్టుకొన్న అందమైన చేతివేళ్ళుగల శుభాంగీ !
నీ నాథుడగు శ్రీకృష్ణుని గుణాలను కీర్తించేందుకు మేమందరం వచ్చివున్నాము.
చూడ ముచ్చటైన నీ చేతిగాజులు గల్లుగల్లుమని శబ్దం చేస్తుండగా
కెందామరలవంటి సొంపైన నీ చేతులతో తలుపు తీయవమ్మా !
ఓ నీలాదేవీ! తలుపుతీసి మేము నోచుతున్న నోమును పలింప జేయవమ్మా !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి