తిరుప్పావై - పాశురము 29
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్
నిత్యమూ స్వామివారి సేవ కోరడం
పొద్దు పొడవడానికి ముందే మసక మసక చీకటిలో వచ్చి సేవించి
నీ పవిత్రపాదపద్మాలకు మంగళాశాసనం పాడుతున్న మా ప్రార్థనను వినుమయ్యా స్వామీ !
పశువులను మేపుకుంటూ జీవనం సాగించే గోపల్లెవాడలో సామాన్యుల ఇంట జన్మించి
అందరికీ అందుబాటులో ఉండే స్వామీ ! దాసానుదాసులమైన నిన్ను సేవిస్తున్న
మా అంతరంగ భావాలను తృణికరించవద్దు.
ఈ రోజు నుంచి ఒక్క పరమార్థాన్ని పొందేందుకు మాత్రమే రాలేదు సుమా !
ఓ గోవిందా ! ఎల్లవేళలా, ఏడేడు జన్మలా స్వామివారితో సంబంధాన్ని కలిగి సేవ చెయ్యగోరుతున్నాము.
ఇంక ఇతర కోరికలకు అవకాశమివ్వవద్దు.
మాకు తప్పక వ్రతఫలం అందజెయ్యి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి