ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల చేరుకొని స్వామి దర్శనానికి వెళ్తే ఆ స్వామిని కన్నులారా చూడకముందే క్యూ లైన్లనుండి బయటికి తోసేయబడే సామాన్య భక్తుల వేదనను పద్మశ్రీ .Dr.శోభారాజు గారు ఈ పాటలో ఎంతో హృద్యంగా చెప్పారు
నా ఇంట నిలచిపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను
మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను
కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను
ముద్దులా మారాజ నిను చూడగా
దండైన నీ హుండిలో వేయగా
ముద్దులా మారాజ నిను చూడగా
దండైన నీ హుండిలో వేయగా
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
మొక్కనీరే కాసేసి నీకు
నిలువనీరే నన్ను ఘడియైన నీముందు
మొక్కనీరే కాసేసి నీకు
పాదాలు కడగంగ దాచిన కన్నీరు
నేలపాలై ఇంకిపోక ముందే
పాదాలు కడగంగ దాచిన కన్నీరు
నేలపాలై ఇంకిపోక ముందే
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
నా ఇంట నిలచిపో గోవిందా
నా కంట నిదురపో గోవిందా
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
కుశలమైనా నిన్ను అడగనేలేదు
ఎదలోని సొదలేవి చెప్పనేలేదు
కుశలమైనా నిన్ను అడగనేలేదు
ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో
ఏ పాట పాడమని అడగబోయితివో
ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో
ఏ పాట పాడమని అడగబోయితివో
తలుచుకుంటే నాకు గుబులాయె సామీ
విడచిపోవాలంటె దిగులాయె సామీ
తలుచుకుంటే నాకు గుబులాయె సామీ
విడచిపోవాలంటె దిగులాయె సామీ
ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ
ఎద నొచ్చి నిట్టూర్పు పొగలొచ్చె సామీ
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
రాను నే నీ పురికి నీవె రా .. నాదరికి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి