Keblinger

Keblinger

14, జనవరి 2016, గురువారం

భ్రమరాంబికాష్టకం - రవిసుధాకర వహ్నిలోచన


సంక్రాంతి శుభాకాంక్షలు


రవిసుదాకర వహ్నిలోచన


 రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణి
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ 
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరీ భ్రమరాంబికా

కలియుగంబున మానవులకూ కల్పతరువై యుండవా
వెలయు శ్రీగిరి శిఖరమందునవిభవమై విలసిల్లవా 
నళినలోచన భక్తజనులకు అష్ట సంపదలియ్యవా
జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరీ భ్రమరాంబికా

అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ 
పొంగుగా కొంకణ పుణ్యభూముల యందునన్ 
 రంగుగా కర్ణాట మగధ మరాట దేశము నందునన్
శృంగిణీ దేశమున వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా
 
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంబవీ
మోక్షమోసగెడి కనకదుర్గవు మూలకారణ శక్తివీ
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరీ భ్రమరాంబికా

ఉగ్రలోచన వరవధూమణి యొప్పు కల్గిన భామినీ
విగ్రహంబులకెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ 
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణీ 
శీఘ్రమే తగు వరములిత్తువు శ్రీగిరీ భ్రమరాంబికా 

నిగమగోచర నీలకుంతల నిర్మలాంగి నిరంజనీ 
 మిగులచక్కని పుష్పకోమలి మీన నేత్ర దయానిధి 
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖ సీమంతినీ 
చిగురుటాకుల వంటి పెదవుల శ్రీగిరీ భ్రమరాంబికా 

సోమశేఖర పల్లవాదరి సుందరీమణి ధీమణి
కోమలాంగి కృపాపయోనిధి కటిల కుంతల ధీమణి
నామనంబున బాయకుండెటి నగకులేశ్వర నందనీ
సీమ లోపల వినుతి కెక్కిన శ్రీగిరీ భ్రమరాంబికా  
 
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివీ 
ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివీ
పాతకంబులు బారదోలుచు భక్తులను చేకొంటివే
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా

వెల్లివిరిసెను  నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించెను నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా

తరుణి  శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా


కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)