రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు
సాయినాథ మహరాజ్ కీ జై
నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా
ఏ జీవమైన భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా
మనుజులలో దైవము నువ్వు
కోసల రాముడివై కనిపించావూ
గురి తప్పని భక్తిని పెంచావు
మారుతిగా అగుపించావూ
భక్త సులభుడవై కరుణించావూ
భోళా శంకరుడిగ దర్శనమిచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు
ఏకమనేకమ్ముగా విస్తరించినావు
ఏకమనేకమ్ముగా విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
నీవు లేని చోటు లేదు సాయీ
ఈ జగమే నీ ద్వారకామాయీ
కృష్ణా కృష్ణా .. హే కృష్ణా
తనువులన్ని నీవు కాచు గోవులేనురా
త్రోవ చూపు తోడు నీవే కృష్ణా
తలపులన్ని నీ వనాల పూవులేనురా
తరగిపోని తావినీవే కృష్ణా
జగదేక జ్ఞానమూర్తి వసుధైక ప్రాణదీప్తి
కరగిపోని కాంతి నీవే
నందనందనా
నీవు లేని చోటు లేదు కృష్ణా
ఈ జగమంతా నీవెలే కృష్ణా
నీవు లేని చోటు లేదు కృష్ణా
ఈ జగమంతా నీవెలే కృష్ణా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి