శుభకరుడు సురుచిరుడు
అల్లా ఆ ఆ ఆ... శ్రీరామా ఆ .....
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడూ
కళ్యాణ గుణగణుడు
కరుణా ఘనాఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారుముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనందనందనుడు అమృతరసచందనుడు
రామచంద్రుడుకాక ఇంకెవ్వడూ
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడుమూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌమూర్తి
ఏ మూర్తి శక్తిచైతన్య మూర్తీ
ఏ మూర్తి నిఖిలాండ నిత్యసత్యస్పూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మసమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తీ
తాగరా .. తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
పా పా ప మపనీప మపనీప మపసనిప
మా పా మా .. శ్రీ రా మా
పా పా ప మపనీని పనిసాస నిరిసనిప
మా పా ని మ ప మ - కోదండ రామా
మపనిసరిసాని పానీపామా .. సీతారామా
మపనిసరిసారి సరిమరిస నిపమా .. ఆనందరామా
మా మా రిమరిమరి సరిమా
రా మా జయరామా
సరిమా .. రామా
సపమా .. రామా
పా......వన నామా
ఏ వేల్పు ఎల్లవేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడులోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పూ
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమనిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలను గల్పూ
ఏ వేల్పు ద్యుతి గొల్పు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి