నవరాత్రులలో దుర్గామాత నాల్గవ స్వరూపం కూష్మాండం..చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని అవలీలగా సృస్ష్టిస్తుంది కాబట్టి అమ్మకి ఆ పేరు వచ్చింది . ఈమె ఎనిమిది భుజాలతో,. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది.. ఆ తల్లిని పూజించిన వారికి ఆయురారో గ్యాలను ప్రసాదించటమేగాక, కష్టాలను కూడా పోగొడుతుంది .. అమ్మవారికి చిల్లులేని అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించాలి.
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే
జై కూష్మాండా జగదంబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి