నవరాత్రులలో దుర్గామాత మూడవ స్వరూపం చంద్రఘంట.
ఈ తల్లి తన శిరసున అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఆమ్మకు ఆ పేరు వచ్చింది . ఈమె తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల,
కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమై ఉంటుంది . ఈమె ఘంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండికౄరులైన రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది.అమ్మకు కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు .
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతేమహ్యం చంద్ర ఘంటేతి విశ్రుతా
జై చంద్రఘంటా జగదంబా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి