శ్రీ తిరుమలవాస జగదీశా
శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలి నాశా
కనరా దాసుల ప్రేమతో వినరా మా మొర
ఏడుకొండలపై వెలసిన ఈశ పరమేశా
ఇరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశా
శేషగిరివాసా నివాళిగ
జీవితాలే నీకర్పించి
సప్తగిరులెక్కి పదాలను
నమ్ముకున్న వారము కాదా
భక్తజన పోషా పరాత్పర
నిన్ను కొలిచి ఆ పరమేష్టి
పాదములు కడిగి విధాతగ
విశ్వకావ్యం రాయలేదా
శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలినాశా
అమ్మ అలిమేలు పద్మావతి
నిన్ను సేవించే సమయానా
అన్నమాచార్య పదాలను
దాచి నీకై ఉంచు వేళా
గౌరి కొలువైన నీ ధానము
కంట చూసే ఘఢియలలోనా
శక్తిపరమైన నీ వాసము
మాకు దక్కే భాగ్యమీరా
శ్రీ తిరుమలవాస జగదీశా
కరుణా భరణా ఇక నీ చరణమే శరణు కలి నాశా
కనరా దాసుల ప్రేమతో వినరా మా మొర
ఏడుకొండలపై వెలసిన ఈశ పరమేశా
ఇరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి