ఓం త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఊర్వారుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్
మంత్రమునకు అర్థం
" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే
మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను...
బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి );
ఉర్వారుకమివ = దోసకాయను వలె ;
మృత్యోః = చావునుంచి ;
ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక;
అమృతాత్ = మోక్షము నుంచి;
మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక )
తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి
నేను విడివడకుండ ఉందును గాక."
మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము
ఋగ్వేదం లోని ఒక మంత్రము.ఇది ఋగ్వేదంలో 7వ మండలం,
59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది.
దీనినే "త్ర్యంబక మంత్రము","రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉన్నది.
ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి,మోక్షం కొరకు జపిస్తారు.
గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.
ఈ మంత్రమునకు ఋషి వశిష్టుడు. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు).
బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.
2 కామెంట్‌లు:
అమ్మా ! చిరంజీవి రాజీ!! నీ బ్లాగ్లో ద్వాదసలింగ పేజి నాకు చాల నచ్చింది ! చాల సంతోషం తల్లి !! - ఫణి ప్రసాద్ ఎల్లజోస్యుల - హైదరాబాద్
నమస్తే "ఫణి ప్రసాద్ ఎల్లజోస్యుల" గారూ..
పోస్ట్ నచ్చినందుకు,
మీ వ్యాఖ్యకు ధన్యవాదములు ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి