Keblinger

Keblinger

13, నవంబర్ 2012, మంగళవారం

అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి...




 అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి...

 





ఆదిలక్ష్మి
సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదమతే |
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి పరి పాలయమాం ||

ధాన్యలక్ష్మి
ఆయికలి కల్మష నాశిని కామిని
వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి
మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని
దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధాన్యలక్ష్మి పరిపాలయమాం ||

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి
మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద
జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని
సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని
ధైర్యలక్ష్మీ పరి పాలయమాం ||

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగ పదాతి సమావృత
పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత
తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
గజలక్ష్మీ రూపేణ పాలయమాం ||

సంతానలక్ష్మి
అయిగజ వాహిని మోహిని చక్రణి
రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి
సప్తస్వర భూషిత గాన నుతే
సకల సురాసుర దేవ మునీశ్వర
మానవ వందిత పాదయుగే
జయ జయహే మధుసూదన కామిని
సంతానలక్ష్మీ పరిపాలయమాం

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని
జ్ఞాన వికాసని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర
భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని
విజయలక్ష్మీ పరిపాలయమాం

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారత భార్గవి
శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ
శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి
కామిత ఫలప్రద హాస్యయుతే
జయ జయహే మధుసూదన కామిని
విద్యాలక్ష్మీ పరిపాలయమాం

ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి
దుంధుభి నాద పూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖ నినాద సువాద్యమతే
వేద పూరాణేతిహాస సుపూజిత
వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధనలక్ష్మి రూపేణా పాలయమాం ||

ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి 
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని
 శంఖ చక్రగదాయక్తే విశ్వరూపిణితే || జయః ||
జగన్మాత్రేచ మోహిన్యై
మంగళం శుభ మంగళం.




4 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

మీరు లక్ష్మీదేవి స్తుతి పోస్ట్ చేసి ఉంటారేమోనని పొద్దున్నే చూసాను...
చీకట్లు పారద్రోలే దీపావళి నాడు...
లక్ష్మీ పూజ శ్రేష్టం...అనుసరణీయం...
మీకు మీ కుటుంబానికీ
దీపావళి వెలుగుల శుభాభినందనలు...@శ్రీ

తెలుగు వారి బ్లాగులు చెప్పారు...

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"శ్రీ" గారూ..
అష్టలక్ష్మీ స్తోత్రం నచ్చినందుకు,మీ శుభాభినందనలకు ధన్యవాదములు..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

@ ''తెలుగు వారి బ్లాగులు''

మీ శుభాకాంక్షలకు ధన్యవాదములు..
మీకు,మీ కుటుంబసభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు..

తెలుగు బ్లాగులన్నీ ఒక చోట చేర్చాలన్న మీ ప్రయత్నం అభినందనీయం..
నా బ్లాగును కూడా మన తెలుగువారి బ్లాగుల్లో చేర్చుతామన్నందుకు చాలా సంతోషం తప్పక చేర్చగలరు..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)