ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వ మామలేశ్వరం
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరం
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి
ఇతి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంపూర్ణమ్
ద్వాదశ జ్యోతిర్లింగాలు
పన్నెండు జ్యోతిర్లింగాలలోమొదటిది సోమనాధ స్వామి..
సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన
శివుని చంద్రుడు ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం
అని పేరు వచ్చింది.ఈ క్షేత్రం "గుజరాత్ లోని సౌరాష్ట్ర" లో వుంది.
2. మల్లికార్జున లింగం (శ్రీశైలం)
ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి.
'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే', శ్రీశైల శిఖర దర్శనం
చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని నమ్మిక.
3. మహాకాళ లింగం (ఉజ్జయిని)
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో శిప్రా నదీ తీరంలోని (మాళవ)
ఉజ్జయినీ నగరంలో వెలసిన క్షేత్రం మహాకాళేశ్వరుడు...
సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.
4. ఓంకారేశ్వర, అమలేశ్వలింగం (ఓంకారం)
మధ్యప్రదేశ్ లోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, జ్యోతిర్లింగాలలో నాలుగవది. ఇక్కడ ఒకే లింగము రెండు బాగములుగా ఉండి,
రెండు పేర్లతో పూజింపబడుతున్నది.
5.కేదారేశ్వర లింగం (కేదారనాథ్)
హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో
సదాశివుడు
కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి
ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు
ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు
6. భీమశంకర లింగం (ఢాకిని):
మహారాష్ట్ర, పూనా లోని భువనగిరి లో వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం
సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం
7. విశ్వేశ్వర లింగం (వారణాశి)
మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ లో విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన క్షేత్రం
8. త్రయంబకేశ్వర లింగం (త్రయంబకం)
మహారాష్ట్ర , నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రం.. బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసిక్ వద్ద తన జటాజూటం నుండి గోదావరి
నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన
పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.
9. వైద్యనాథ లింగం లేక అమృతేశ్వరుడు
( వైద్యనాదం, దేవఘర్)
10. నాగేశ్వర లింగం (ద్వారక)
విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.
11. రామేశ్వర జ్యోతిర్లింగం (రామేశ్వరం)
శివార్చన చేసి,జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని
కోరగా పరమశివుడు వెలసిన క్షేత్రం
12. ఘృష్ణేశ్వర లింగం (దేవగిరి)
మహారాష్ట్రలోని ఎల్లోరా గృహలకి దగ్గరలో దేవగిరి పర్వత సమీపంలో
ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి