Keblinger

Keblinger

25, నవంబర్ 2012, ఆదివారం

శివ అక్షరమాలా స్తోత్రం




తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే 
శివ  అక్షరమాలా స్తోత్రం..



 సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ


ద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ       
నందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ                 
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ           
శ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ                 
రగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ                 
ర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ                  
గ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ           
పనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ           
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ 

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
        
కానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ                 
శ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ             
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ                
రసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ                     
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ        
హారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ               
మలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ                  
డ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ             
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ               
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ               
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ              
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ             
త్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ                
న్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ                

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ              
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ                
టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
క్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ          
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశ శివ               
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ           
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ             
త్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ            
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ             
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ             
రణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ              
ళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ       
న్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ             
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ            

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ            
స్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ          
న్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ            
తిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ                
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ     
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ             
రదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ           
శాంతిస్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ             
ణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ         
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ               
రపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ      
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ                   
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ



 

2 కామెంట్‌లు:

పూర్వ ఫల్గుణి (poorva phalguni) చెప్పారు...

రాజి గారు అసలు శివుడుఅంటే చాలఇష్టం. అందులోఈ కార్తీకమాసంలో అమరావతి,యాగంటి వెళ్లివచ్చాను.మా ఇంట్లో ప్రతి ఏడు మహాలింగార్చన చేసుకొంటాము. ఇంకా మీరు మీ బ్లాగ్ లో పొందుపరచిన ఈ ఆణిముత్యాలు వింటూ వుంటే అంతటా శివమయం.అంతకుమించి పరవశం ఆ అర్ధనారిశ్వర్లులను తలుచుకొని. నిన్ననే కేదరనాథ్ కి టిక్కట్లు కూడాబుక్ చేసుకోన్నాము.
మీ బ్లాగ్ ఎలా చూడలేదు అనుకోవడంకంటే పోనిలేఇప్పుడు
చూసాను కదా ఆనంద పడ్డాను.
మీకు ఆసక్తి వుంటే ఈ నెల కౌముది లో నా కద'కృష్ణం వందే జగద్గురుం'ప్రచురించారు .చదివి మీ అభిప్రాయం తెలుపగలరు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"పూర్వ ఫల్గుణి(poorva phalguni)"గారూ..

నా బ్లాగ్ నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములండీ..

మా ఇంట్లో కూడా శివారాధనే.. శివుడు నా ఇష్ట దైవం కూడా.. ఈ కార్తీక మాసంలో నా భక్తిప్రపంచం లో ఆ శివస్తుతులన్నీ పోస్ట్ చేయాలన్న నా కోరిక శివయ్య అనుగ్రహంతో పూర్తి అయ్యింది...

తప్పకుండా మీ కధ చదువుతాను..
ThankYou..


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)