పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
నేర మింతయును నాది నేరుపింతయును నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానిని నీవు
ఈరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
నేర మింతయును నాది నేరుపింతయును నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానిని నీవు
ఈరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
ధరలోన నాయందు మంచితన మేది
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి