Keblinger

Keblinger

2, ఆగస్టు 2016, మంగళవారం

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా



సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా



సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా
పొలసు మేనివాడు బోరవీపు వాడు
సెలసు మోరవాడు సిన్నెక్కా

కొలుసుల వంకల కోరలతో
భూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా
కొలుసుల వంకల కోరలతో
భూమి వెలసినాడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

మేటి కురుచవాడు మెడమీది
గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా
మేటి కురుచవాడు మెడమీది
గొడ్డలి సీటకాలవాడు సిన్నెక్కా

ఆటదానిబాసి ఆడవిలో రాకాశి
వేటలాడీ  జూడవే సిన్నెక్కా
ఆటదానిబాసి ఆడవిలో రాకాశి
వేటలాడీ జూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా

బింకపు మోతల పిల్లగోవి వాడు
సింక సూపులవాడు సిన్నెక్కా
బింకపు మోతల పిల్లగోవి వాడు
సింక సూపులవాడు సిన్నెక్కా

కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెక్కా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుడు సూడవే సిన్నెక్కా

సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా
సిరుత నవ్వుల వాడు సిన్నెక్కా
వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్కా


7 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

ఇది మీ బ్లాగా ? "భక్తి ప్రపంచం" అనే టైటిల్ వ్రాయలేదెందుకని ? సెట్టింగ్స్ లోకి వెళ్ళి సరిచేయండి !

ఇది అన్నమాచార్య కీర్తనేనా ? చాలా బాగుంది. వంట చేసుకుంటూ ఈ బ్లాగు చూస్తుంటాను. యూట్యూబ్ లో లిరిక్స్ తో పాటు వీడియోలు తక్కువ కదా !

మేటికురచవాడు .....అన్న లైన్ కి అర్ధమేమిటో తెలిస్తే చెపుతారా ? వెంకటేశ్వర స్వామి పొట్టివాడనా ?



రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నీహారిక గారు ఈ బ్లాగ్ నాదేనండీ :) .. "భక్తిప్రపంచం"టైటిల్ బ్లాగ్ పైన left side కనిపిస్తుందండీ, image settings లో ఏదో problem అయ్యుంటుంది అందుకే కనిపించటం లేదేమో,బ్లాగ్ template change చేయాలి...

అవునండీ youtube లో lyricsతో వీడియోలు చాలా తక్కువే వుంటాయి. కానీ ఈ మధ్య youtube వలన చాలా మంచి పాటలు,సినిమాలు చూడగలుగుతున్నాము.

ఇది అన్నమాచార్య సంకీర్తనేనండీ .. విష్ణుమూర్తి దశావతారాలని వర్ణిస్తున్నది ..
పొలసమేనివాడు అంటే మత్స్యావతారం
కొలనిలో వంకలకోరలతో అంటే వరాహావతారం
ఇక మేటి కురచవాడు అంటే వామనావతారం

ఇలా నరసింహావతారం,కృష్ణావతారం అన్నీ ఈ కీర్తనలో వర్ణించారు..
ఇదండీ నాకు తెలిసినంత వరకు అర్ధం :)

ఇంకా నా బ్లాగ్ లో title problem చెప్పినందుకు కూడా Thank you అండీ.. మీరు చెప్పకపోతే తెలిసేది కాదు

Thank you :)



రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నీహారిక గారు ..Comment లో చిన్న సవరణండీ
కొలసుల వంకర కోరలతో .. వరాహావతారం

నీహారిక చెప్పారు...

మీ బ్లాగ్ లో "భక్తి ప్రపంచం " అని నాకు కనిపిస్తున్నది. టెంప్లేట్ కూడా బాగుంది. మాలికలో మీ బ్లాగ్ టైటిల్ రావడం లేదు.మీ url కరెక్ట్ గా ఉందా లేదా చూడండి లేదా మాలిక అడ్మిన్ కి తెలియజేయండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మాలికలో "భక్తిప్రపంచం" అనే కనిపిస్తుందండీ.. ఇప్పుడు కూడా చూశాను..

Lalitha చెప్పారు...

TTD వారి దేశి కవితా గానం అనే కాసెట్ లోది ఈ పాట. మీకు అందులోని మిగిలిన పాటలు - అంటే - ఉగ్గు పెట్టరే ఓయమ్మా , ఉయ్యాల బాలునూపెదరు, సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియె, జగడపు చనవుల జాజర - ఈ పాటలు మీకు తెలిస్తే చెప్పగలరా?
~ లలిత

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

లలిత గారు మీరు చెప్పిన పాటల్లో కొన్ని Dr.శోభారాజ్ గారు పాడినవి కాకుండా వేరేవి ఉన్నట్లున్నాయండీ.. నేను చూసి చెప్తాను.

Thank you

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)