కులుకక నడవరో కొమ్మలాలా
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతులాలా
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల హారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
కులుకక నడవరో కొమ్మలాలా
2 కామెంట్‌లు:
ఎన్నాళ్లకెన్నాళ్లకి మళ్లీ విన్నానీ అన్నమాచార్య కీర్తన !? ఇందులోని జాజులు-జమళి ముత్యాలు నాకెంతో ఇష్టమయిన మాటలు :)
~లలిత
Thank You లలిత గారు.. నిజంగా అన్నమాచార్య సంకీర్తనల్లో పదాలు చాలా బాగుంటాయండీ ..
రిప్లై లేట్ గా ఇస్తున్నాను ఏమీ అనుకోకండి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి