తిరువేంకటాధీశ జగదీశా
శ్రీశైలవాసా ... శేషాద్రివాసా
గరుడాద్రివాసా ... వేంకటాద్రీశా
నారాయణాద్రీశ ... వృషభాద్రివాసా
వృషశైలవాసా .. సర్వలోకేశా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
తిరువేంకటాధీశ జగదీశా
కరుణనేలగ రావె కమలేశా
తిరువేంకటాధీశ జగదీశా
కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ
కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ
కోరికల దీర్చేటి కొంగు బంగారమై
కొండలేడింటిపై కొలువు తీరేవయ్యా
తిరువేంకటాధీశ జగదీశా
కరుణనేలగ రావె కమలేశా
పాతకమ్ములదీర్చు పంచధారల నడుమ
బహు పుణ్యప్రదమైన స్వామిగ్రహ తీరాన
ఆనంద నిలయాన అందాన కొలువున్న
ఆనందరూప మమ్మాదరింపగ రావె
తిరువేంకటాధీశ జగదీశా
కరుణనేలగ రావె కమలేశా
శివరూపమీవంచు చెప్పుదురు కొందరు
ఆదిశక్తివటంచు అందురింకొందరు
నారాయణుండంచు నమ్ముదురు కొందరు
మూడుశక్తులు గూడ ముచ్చటౌ రూపమ్ము
తిరువేంకటాధీశ జగదీశా
కరుణనేలగ రావె కమలేశా
తిరువేంకటాధీశ జగదీశా .. జగదీశా .. జగదీశా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి