తిరుప్పావై - పాశురము 1
మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.
గోదాదేవి నోముకై గోపికలను పిలుచుట
చెలియల్లారా ! రండి రారండీ !సంపత్కరములయిన సర్వాభరణములతో
విరాజిల్లుతున్న ఓ గోపకన్నియలారా రండీ రారండీ!
ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం. అందులోను
పున్నమి వెన్నెల పిండిఆరబోసినట్లు ఉన్న వేకువజాము.
పోటుమగడైన నందునిఅనుంగుబిడ్డను సేవింతమురారే !
నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోదముద్దుపట్టి అయిన
ఆ బాలకిశోరాన్ని సేవించి తృప్తిదీర సర్వశుభములు పొందుటకు
ఈవేకువన చన్నీట జల్లులాడి సేవించుటకుపోవుదము రారే !
ఇది మన వ్రతం కదా !

2 కామెంట్లు:
తిరుప్పావై పాశురాలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది. భక్తిభావాన్ని రేకెత్తిస్తుంది. అన్నమయ్య, త్యాగరాజు, పురందరదాసు లాంటివారు ఎన్ని కీర్తనలు పాడినా, వాటిని సేపే తన్మయత్వం చెందుతాము. కాని తిరుప్పావై వింటుంటే రోజు రోజంతా ఏదో తెలియని తన్మయత్వానికి గురవుతుంది. అదే ఆ పాశురాల్లో ఉన్న మహత్వమేమో. వీటిని వింటూ వుంటే మనం పూర్వ జన్మలో సుకృతం చేసుకున్నామో అనిపిస్తుంది. ఇక వీటిని నేర్చుకొని పాడేవాళ్ళ జన్మ సార్థకం అయిందని భావించాల్సి వుంటుంది. కాబట్టి వీటిని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ శ్రీహరి కీర్తనా తన్మయత్వంలో మునిగిపోదామా!
తిరుప్పావై పాశురాలను గురించి మంచి మాటలు చెప్పారు..
ధన్యవాదములు "Raghu Kumar" గారు.
తిరుప్పావై 30 పాశురాలను ఈ లింక్ లో చూడొచ్చు
http://raaji-bhaktiprapancham.blogspot.in/2015/05/30.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి