Keblinger

Keblinger

2, డిసెంబర్ 2015, బుధవారం

కార్తీక పురాణం - 21




కార్తీక పురాణం - 21వ అధ్యాయము
పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట

ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు - హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే. ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.

దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే యీ యుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱ్ఱి౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీరాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేని, నాహితోపదేశము నాలకింపుము.

ఇది కార్తీకమాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు" మని హితోపదేశము చేసెను.

అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా |
యః స్మరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ||

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.



కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)