Keblinger

Keblinger

8, డిసెంబర్ 2015, మంగళవారం

కార్తీక పురాణం - 27




కార్తీక పురాణం - 27వ అధ్యాయము
దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.

ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు. కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము
 ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.


కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)