Keblinger

Keblinger

12, అక్టోబర్ 2015, సోమవారం

శ్రీ కనకదుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు - 2015


 


మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ, సౌభాగ్యప్రదాయిని అయిన ఆ దేవిని ఒక్కోరోజు ఒక్కోక్క దేవిని కొలిచి మీకు తెలిసిన ముతైదువులను పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ పెట్టి తాంబూలాలతో వారిని సంతుస్టులను చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందాలి. ఆ తల్లిని ప్రసన్నురాలిని చేసుకొని సకల సౌభాగ్యలు అష్ట ఐశ్వర్యాలు కావాలని కోరుకొని వచ్చిన పేరంటాలు అమ్మవారి మీద పాటలు పాడి హారతులు ఇచ్చి అక్షింతలు వేసి పూజించాలి.

శరన్నవరాత్రి ఉత్సవాలలో కార్యక్రమ వివరములు

మొదటి రోజుఆశ్వియుజ శుద్ద పాడ్యమి నాడు తెల్లవారుఝామున గం. 2.30 ని!!లకు స్నపనాభిషేకం, అనంతరం భక్తులకు ఉ!! గం 9.00 లకు దర్శనం ప్రారంభం అగును, అనంతరం అమ్మవారి విగ్రహం భవానీదీక్షా మంటపమునకు ఊరేగింపుగా తీసుకు వెళ్ళబడును.ఉదయం 9.30 ని!!లకు గణపతి పూజ, పుణ్యాహావాచకం, అఖండజ్యోతి, మంటప కలశస్ధాపన, అనంతరం ప్రత్యేక కుంకుమార్చన గం 10.00 లకు ప్రారంభం అగును మరియు యాగశాలలో చండీయాగం ప్రారంభం అగును.రెండోరోజు ఆశ్వియుజ శుద్ద విదియ నుండి ఆశ్వియుజ శుద్ద దశమి వరకు, భవానీ మండపంలో రెండు బ్యాచ్ లుగా ఉ!! గం. 7.00 నుండి గం. 9.00 లకు మరియు గం. 10.00 ల నుండి 12.00 ల వరకు ఉభయదాతలతో ప్రత్యేక కుంకుమార్చన జరుగును, మొదటి రోజు నుండి చివరి రోజువరకు యాగశాలలో 10 మంది ఋత్విక్కులచేత ఉభయదాతలతో చండీయాగం, రుద్రయాగం, శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అభిషేకం నిర్వహించబడును. ఆశ్వియుజ శుద్ద విదియ నుండి ఆశ్వియుజ శుద్ద దశమి వరకు ప్రతిరోజు ఉ.గం. 10.00 లకు రాజభోగ నివేదనలు జరుగును, మరియు సాయంత్రం గం. 7.00 ల నుండి గం. 8.00 వరకు మహానివేదన పంచహారతుల, చతుర్వేద స్వస్తి జరుగును. ఆశ్వియుజ శుద్ద షష్ఠి నాడు న సాయంత్రం గం. 5.00 లకు అర్చక మహాసభ భవానీ దీక్ష మండపం నందు జరుగును. మూలానక్షత్రం సందర్భమున గం. 4.౦౦ ల నుండి గం. 5.౦౦ ల మధ్య ప్రభుత్వం తరుపున శ్రీ ముఖ్యమంత్రివర్యులచే శ్రీ అమ్మవార్కి పట్టువస్త్ర సమర్పణ. ఆశ్వియుజ శుద్ద అష్టమి న సాయంత్రం గం. 5.00 లకు వేద విద్వత్సభ భవానీ దీక్ష మండపం నందు జరుగును. ఆశ్వియుజ శుద్ద దశమి న ఉ!! గం. 12.00 లకు పూర్ణాహుతి, కలశజ్యోద్వాసన, సాయంత్రం గం. 4.00 లకు తెప్పోత్సవం ఊరేగింపు శివాలయం నుండి ప్రారంభం. రాత్రి గం!! 7.00 లకు నటరాజస్వామి వారి దేవాలయం వద్ద శమీపూజ జరుగును.
 
 
 
 వారముతిదిశ్రీ అమ్మవారి దివ్య అలంకరములు
13-10-2015మంగళవారముఆశ్వయుజ శుద్ధ పాడ్యమిశ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
14-10-2015బుధవారముఆశ్వయుజ శుద్ధ పాడ్యమి(మిగులు)శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
15-10-2015గురువారముఆశ్వయుజ శుద్ధ విదియశ్రీ గాయత్రి దేవి
16-10-2015శుక్రవారముఆశ్వయుజ శుద్ధ తదియశ్రీ మహాలక్ష్మిదేవి
17-10-2015శనివారము ఆశ్వయుజ శుద్ధ చవితిశ్రీ అన్నపూర్ణా దేవి
18-10-2015ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పంచమిశ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
19-10-2015సోమవారముఆశ్వయుజ శుద్ధ షష్ఠిశ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
20-10-2015మంగళవారముఆశ్వయుజ శుద్ధ సప్తమిశ్రీ దుర్గా దేవి
21-10-2015బుధవారముఆశ్వయుజ శుద్ధ అష్టమిశ్రీ మహిషాసురమర్ధినీ దేవి

కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)